సుశాంత్ సింగ్‌ను గుర్తు చేసుకుంటూ సోదరి ఎమోషనల్ పోస్ట్..

by Hamsa |   ( Updated:2023-01-17 10:37:08.0  )
సుశాంత్ సింగ్‌ను గుర్తు చేసుకుంటూ సోదరి ఎమోషనల్ పోస్ట్..
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2020 లో ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విషయం తెలిసిందే. సుశాంత్ అభిమానులు ఆయనను ఇప్పటికీ మరచిపోలేకపోతున్నారు. తాజాగా, సుశాంత్ సింగ్ సోదరి ప్రియాంక సింగ్ ఎమోషనల్ ట్వీట్లు చేసింది. కుక్క ఫడ్జ్ సోమవారం మరణించింది ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. "ఇంత కాలం ఫడ్జ్ నువ్వు నాతో ఉన్నావు! ఇప్పుడు నువ్వు కూడా నీ స్నేహితుని దగ్గరకే వెళ్లిపోయావు. నా గుండె తట్టుకోలేకపోతుంది''. అంటూ సుశాంత్ కుక్కతో ఉన్న ఫొటోను షేర్ చేసింది. దీంతో అది చూసిన నెటిజన్లు వీరిద్దరు స్వర్గంలో కూడా కలిసే ఉంటారు. అని కామెంట్లు పెడుతున్నారు. మరో ట్వీట్‌లో సుశాంత్ సింగ్ మృతి కేసును ఉద్దేశపూర్వకంగా నిలిపివేశారు. లేకపోతే డి ఛార్జ్ షీట్ దాఖలు చేయడంలో విపరీతమైన జాప్యానికి కారణం లేదు'' అని చెప్పుకొచ్చింది.

Read More:

ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళ మృతి..

నాకు పెళ్లి అయింది.. దూరం జరుగు అంటున్న రాఖీ సావంత్‌


So long Fudge! You joined your friend's Heavenly territory… will follow soon! Till then… so heart broken 💔 pic.twitter.com/gtwqLoELYV

Advertisement

Next Story

Most Viewed