ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు.. సూర్య నారాయణ సంతాప సభలో ప్రముఖులు

by Hajipasha |   ( Updated:2023-01-23 14:09:40.0  )
ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు.. సూర్య నారాయణ సంతాప సభలో ప్రముఖులు
X

దిశ, సినిమా: ఇటీవలే అనారోగ్య సమస్యలతో చనిపోయిన ప్రముఖ నిర్మాత ఎ. సూర్య నారాయణ సంతాప సభ సోమవారం ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగింది. నిర్మాతల మండలి, ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సి. కళ్యాణ్, కె.ఎస్ రామారావు, ప్రసన్న కుమార్, దామోదర్ ప్రసాద్, తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత నహీం, శివ రామకృష్ణతో పాటు పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. ఈ మేరకు సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. సూర్య నారాయణతో తనకు 30 ఏళ్ల బంధం ఉందని, ఈ రోజు తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఆయనే అన్నాడు. సూర్య నారాయణ మన మధ్య లేకపోవడం బాధాకరమన్న కే.ఎస్ రామారావు.. 2023లో ఇలాంటి సంతాప సభలు లేకుండా ఉండాలని కోరుకున్నారు. ఫిల్మ్ ఛాంబర్‌కు ఉన్న ప్రతి ఇటుకలో ఆయన భాగస్వామ్యం ఉందన్న ప్రసన్న కుమార్.. నిత్యం అందరి గురించి ఆలోచించే వ్యక్తి మన మధ్య లేకపోవడం బాధాకరమన్నాడు.

Advertisement

Next Story