- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Surya-Jyothika: విడిపోయారా? జ్యోతిక మకాం ముంబైకి..? (వీడియో)
వెబ్ డెస్క్: సూర్యా జ్యోతికా లవ్‌లీ సెలిబ్రిటీ కపుల్‌గా మనందరికీ పరిచయమైన జంట. అయితే రీసెంట్ గా వాళ్లిద్దరూ విడిపోతున్నట్టు ఒక న్యూస్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. నిజంగానే వాళ్ళు విడిపోయారా? అందుకేనా సూర్య చెన్నైలో ఉంటె, జ్యోతిక తన పిల్లలతో కలిసి ముంబై లో ఉంటున్నారు? అసలు ఈ విడాకుల వదంతులకంటే ముందు వారి ప్రేమ కథను విందాం. సూర్య తన రెండో సినిమా అయిన పూవెళ్ళాం కొత్తుపర్ లో మొదటిసారిగా జ్యోతికతో కలిసి నటించాడు. ముంబై ముద్దుగుమ్మ జ్యోతికకు తమిళ్ రాకపోవటం వల్ల సూర్యతో ఎక్కువ మాట్లాడలేదు. సినిమా అయిపోయాక ఇద్దరూ ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ అయిపోయారు.
ఒకరోజు సూర్య ఒక పెద్ద దర్శకుడిని కలవడానికి సెట్స్‌కు వెళ్ళాడు. ఆ సినిమాలో నటిస్తున్న జ్యోతిక అక్కడ ఉండటం సూర్య చూసినా ఆమె ఏమనుకుంటుందో అని ఆమెను దాటేసి వెళ్ళిపోయాడు కానీ జ్యోతిక అసిస్టెంట్ ను పంపి అతన్ని పిలిపించుకుని మాట్లాడింది. మాటల్లో ఇద్దరూ నంబర్లను మార్చుకున్నారు. అప్పుడప్పుడూ మాట్లాడుతూ ఉండేవారు అలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఒకసారి గౌతమ్ మీనన్ ఒక సినిమాకు జ్యోతికను ఫైనల్ చేసి ఒక పెద్ద హీరో డేట్స్ కోసం ఎదురుచూస్తున్నాడు.
అప్పుడే జ్యోతిక గౌతమ్ మీనన్ కు సూర్య గురించి చెప్పి, అతన్నే హీరో గ పెట్టించింది. ఆ సినిమా పెద్ద హిట్. ఇద్దరూ రాత్రికి రాత్రే మంచిపేరు తెచ్చుకుని, స్టార్డమ్ తెచ్చుకున్నారు. ఆ సినిమా మేకింగ్ అప్పుడే సూర్య జ్యోతికకు ఫిదా అయిపోయి ప్రొపొస్ కూడా చేసాడు. జ్యోతిక కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఎంచక్కా వాళ్ళు ప్రేమ పావురాలుగా దగ్గరయ్యారు. తన ప్రేమ విషయాన్నీ ఇద్దరి ఇళ్లల్లో ఒప్పుకోలేదు. "జ్యోతిక ముంబై అమ్మాయి, పైగా సినిమాల్లో నటించింది. మన తమిళ సంప్రదాయాలకు ఆమె సరిపోదు సంవత్సరం తిరక్కుండానే విడాకులు తీసుకుంటుంది" అని సూర్య శివకుమార్ అన్నారు.
ఇటు జ్యోతిక అక్క నగ్మా జ్యోతిక ఇంట్లో ఒప్పిస్తే సూర్య తన నాన్న శివకుమార్ ను కన్విన్స్ చేసాడు. ఆలా వీళ్ళిద్దరూ ఒక్కటయ్యారు. ముంబైలో పుట్టి సినిమాల్లో నటించి తమ ఇంటి కోడలిగా వచ్చిన జ్యోతికను సినిమాల్లో నటనను ఇక ఆపెయ్యమని సూర్య నాన్న చెప్పారు. కొంత బాధ పడినా జ్యోతిక సూర్య కోసం ఒప్పుకుంది. మెట్టినింట్లో సంస్కృతులు వేరైనా అందరిలో కలిసిపోయింది. అందరినీ ప్రేమగా చూసుకునేది. అందుకే కార్తీకి వదిన జ్యోతిక అంటే అంత ప్రేమ. కార్తీ జ్యోతికను వదిన లాగా కాకుండా అమ్మలాగా భావిస్తాడంటేనే జ్యోతిక సూర్యల ప్రేమ ఎంత గొప్పదో అర్థంచేసుకోవచ్చు.
అయితే వాళ్లిద్దరూ విడిపోతున్నట్టుగా వినిపిస్తున్న వదంతులు అబద్ధమని కార్తీ ఒక సభలో తేల్చి చెప్పారు. పిల్లలు పెద్దయ్యారని, వాళ్ళ చదువుల కోసమే దూరం గ ఉన్నారని, అయినా కుదిరినప్పుడల్లా సూర్య ముంబై వెళ్తున్నాడని కార్తీ చెప్పాడు. మరో సంవత్సరంలో జ్యోతిక తిరిగి చెన్నై వచ్చేస్తుంది ఇలాంటి ఫేక్ న్యూస్ రాసి బాధ పెట్టొద్దు అని కార్తీ చెప్పుకొచ్చాడు. కాబట్టి ఇక ఫేక్ న్యూస్‌లను నమ్మకండి. స్వీటెస్ట్ కపుల్ కలకాలం కలిసే ఉంటారు. వాళ్ళ జంట మనను అలరిస్తూనే ఉంటుంది.