ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. మహేష్ ‘గుంటూరు కారం’ మూవీలో ఎన్టీఆర్..

by sudharani |   ( Updated:2023-11-09 13:17:12.0  )
ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. మహేష్ ‘గుంటూరు కారం’ మూవీలో ఎన్టీఆర్..
X

దిశ, సినిమా: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటోంది. ఇక మహేష్‌కు జోడీగా శ్రీలీల, మీనాక్షీ చౌదరీ నటిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్‌గా విడుదల కానుంది. రీసెంట్‌గా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ ‘దమ్ మసాలా’ విడుదల కాగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సాంగ్‌లో విజువల్స్, మహేష్ మాస్ లుక్ కేక పెట్టిస్తోంది. సంజిత్ హెగ్డే, థమన్ పాడిన ఈ పాటకు.. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.

ఇకపోతే తాజాగా ఓ షాకింగ్ అప్‌డేట్ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఓ గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నట్లు ఓ వార్త వినపడుతుంది. ఈ విషయం ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. నిజం అయితే బాగుండు అని కామెంట్ చేస్తున్నారు ఇద్దరు హీరోల అభిమానులు. ఒకవేళ ఇదే నిజం అయితే మాత్రం బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం.

Advertisement

Next Story

Most Viewed