Supriya: పవన్ సినిమా సెట్స్ నుంచి నాలుగు సార్లు పారిపోయానంటున్న సుప్రియ

by Prasanna |   ( Updated:2023-04-14 05:30:33.0  )
Supriya: పవన్ సినిమా సెట్స్ నుంచి నాలుగు సార్లు పారిపోయానంటున్న సుప్రియ
X

దిశ, వెబ్ డెస్క్: అన్ స్టాపబుల్ షో తర్వాత ఆ రేంజులో కాకపోయినా ప్రేక్షకుల్లో గుర్తింపును సంపాదించుకున్న షో సోనీ లివ్ లో ప్రసారమయ్యే నిజం విత్ స్మిత షో. ఈ షోలో రాధిక, సుప్రియ, స్వప్నదత్ పాల్గొనగా సుప్రియ మాట్లాడుతూ కొన్ని షాకింగ్ విషయాలను వెల్లడించారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా షూటింగ్ సమయంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగుసార్లు సెట్ నుంచి పారిపోయానని ఆమె చెప్పింది. ఆ సమయంలో పవన్ నాతో ఈ సినిమా షూటింగ్ ఖచ్చితంగా పూర్తి చేయాలని చెప్పారని సుప్రియ అన్నారు. అప్పుడు రాధిక మాట్లాడుతూ నా కంటే అందంగా ఉండే వాళ్లు, నా కంటే బాగా నటించేవాళ్లు చాలా మందే ఉన్నారని ఆమె మాటల్లో తెలిపింది. ఇది ఖచ్చితంగా విధిరాతే అంటూ చెప్పుకొచ్చింది. ఇక నిర్మాత స్వప్నాదత్ మాట్లాడుతూ " నేను చిన్న వయస్సులో ఉన్నప్పుడే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చానని, అలాగే చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని తెలిపారు. నేడు ఫుల్ ఎపిసోడ్ సోనీ లివ్‌లో విడుదల చేయనున్నారు.

Also read: ఏజెంట్ మూవీ నుంచి న్యూ సాంగ్ రిలీజ్.. అదరగొట్టిన అఖిల్..

Advertisement

Next Story