సూపర్ స్టార్ రజినీకాంత్ ‘లాల్ సలామ్’ టీజర్ రిలీజ్

by Hamsa |   ( Updated:2023-11-12 09:11:40.0  )
సూపర్ స్టార్ రజినీకాంత్ ‘లాల్ సలామ్’ టీజర్ రిలీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో, ఆయన కూతురు ఐశ్వర్య డైరెక్షన్‌లో ‘లాల్ సలామ్’ రాబోతున్న విషయం తెలిసిందే. ఇందులో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. లాల్ సలామ్‌ను సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రయూనట్ ఇది వరకే ప్రకటించారు. తాజాగా, నేడు లాల్ సలామ్ టీజర్ విడుదలైంది. ఈ సినిమాలో రజినీకాంత్ ముస్లిం నాయకుడు ‘మొయ్దీన్ భాయ్‌’గా క‌నిపించ‌నున్నాడు. న‌టి జీవిత రాజశేఖర్ కూడా ఈ సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీలో లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. హిందూ, ముస్లిం గొడవల మధ్య తెరకెక్కబోతున్నట్టు తెలుస్తుంది. ఒక ఊరిలో జరిగే హిందూ ముస్లిం గొడవలు, ఓ ముస్లిం నాయకుడిగా రజినీకాంత్ ఈ గొడవలపై ఎలా స్పందించాడు అనేది కథగా ఉండబోతుంది. కాగా ఈ సినిమా త్వరలో పాన్ ఇండియా మూవీగా థియేటర్స్‌కి రాబోతుంది.


Advertisement

Next Story