మెగాస్టార్ 'గాడ్ ఫాదర్'పై సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రశంసలు

by GSrikanth |   ( Updated:2022-10-11 10:11:40.0  )
మెగాస్టార్ గాడ్ ఫాదర్పై సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రశంసలు
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన గాడ్ ఫాదర్ చిత్రం అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. కేవలం నాలుగు రోజుల్లోనే వందకోట్లు కొల్లగొట్టి బాస్ సత్తా ఏంటో మరోసారి బాక్సాఫీస్‌కు చూపించారు. ఇప్పటికే ఈ సినిమాను వీక్షించిన టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులంతా మెగాస్టార్‌కు శుభాకాంక్షలు తెలుపారు. తాజాగా, ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ రజినీకాంత్ వీక్షించారు. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర దర్శకుడు మోహన్ రాజా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. 'అద్భుతమైన సినిమా, చాలా బాగుంది.' అంటూ చిత్ర బృందాన్ని సూపర్ స్టార్ ప్రశంసించినట్లు డైరెక్టర్ తెలిపారు. కాగా, ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో పాటు, టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్, లేడీ సూపర్ స్టార్ నయనతారా కీలక పాత్రలో నటించారు. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందించగా, కొనిదెల ఆర్ట్స్ బ్యానర్‌పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మించారు.

ఇవి కూడా చదవండి : హే గరిక.. నువ్వో' గడ్డిపరక'.. ఆర్జీవీ సంచలన కామెంట్స్





Advertisement

Next Story