Mahesh Babu-Vinesh phogat: బాధలోనున్న వినేశ్ ఫొగాట్‌‌పై మ‌హేశ్ బాబు సంచలన కామెంట్స్ .. ట్వీట్ వైరల్

by Anjali |
Mahesh Babu-Vinesh phogat: బాధలోనున్న వినేశ్ ఫొగాట్‌‌పై  మ‌హేశ్ బాబు సంచలన కామెంట్స్ .. ట్వీట్ వైరల్
X

దిశ, సినిమా: రెజ్లింగ్‌లో వినేశ్ ఫొగాట్ ఫైనల్‌లో పతకం సాధిస్తుందని ఆశతో ఎదురుచూసిన భారత అభిమానులకు భారీ షాక్ తగిలింది. ఫైనల్ కు దూసుకెళ్లిన వినేశ్ రజత పతకం ఖరారు చేసుకుంది. తద్వారా మహిళల విభాగంలో తొలిసారిగా ఫైనల్ చేరిన భారత రెజ్లర్ గా చరిత్ర సృష్టించింది. ఫైనల్ చేరే క్రమంలో డిఫెండింగ్ చాంపియన్ యు. సుసాకిని .. వినేశ్ ఓడించింది. 50 కేజీల విభాగంలో నిన్న వినేశ్ తలపడాల్సి ఉండగా ఆమె బరువును చూసిన నిర్వాహకులు 100 గ్రాములు అదనంగా ఉందని గుర్తించారు. ఫలితంగా వినేశ్ ఫొగాట్ పై అనర్హత వేటు వేస్తూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నాయి.

ఫైనల్ మ్యాచ్‌కు ముందు డిస్ క్వాలిఫై చేశాయి. వినేశ్ ఫొగాట్ పై అనర్హత వేటు పడటంతో ఇండియన్ క్రీడాకారుల గుండెలు బాధతో నిండిపోయాయి. దీంతో అభిమానులంతా వినేశ్ ఫొగాట్ కు ధైర్యం చెబుతూ సోషల్ మీడియా వేదికన పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా వినేశ్ కు అండగా నిలబడ్డారు. ప్రిన్స్ ట్విట్టర్ వేదికన రాసుకొస్తూ.. ‘‘రిజల్ట్ తో సంబంధం లేదు. వినేశ్ మీరు ఫైనల్ వరకు చేరుకున్నారు. అది మీ గొప్పతనం అని చెప్పాలి. మీరు నిజమైన ఛాంపియన్. ఆ విషయం అందరికీ తెలుసు.

కష్టాల్లో అండగా నిలవడానికి మీ ధృడత్వం, బలం అందరికి స్ఫూర్తిదాయకం. పతకం రావడం ముఖ్యం కాదు. మీ స్ఫూర్తి మా అందరిలో ప్రకాశిస్తుంది. 1. 4 బిలియన్ హృదయాలు మీతో పాటుగా ఉన్నాయి.’’ అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు వినేశ్ ఫొగాట్ ను కొనియాడారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిన్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, అండ్ తాప్సీ కూడా వినేశ్ కు ధైర్యం చెబుతూ నెట్టింట పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed