సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. వచ్చే సంక్రాంతికి ఆ సినిమా రిలీజ్

by Javid Pasha |   ( Updated:2023-03-26 14:51:04.0  )
సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. వచ్చే సంక్రాంతికి ఆ సినిమా రిలీజ్
X

దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఎస్ఎస్ఎంబీ28 కి సంబంధించిన అప్డేట్ ను మూవీ నిర్మాతలు అందించారు. 2024 జనవరి 13న (సంక్రాంతి సందర్భంగా) మహేశ్ బాబు మూవీని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు వంశీ, వినోద్, నవీన్ నూలి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు వారు పోస్టర్ ను రిలీజ్ చేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీలో మహేశ్ బాబుకు జోడీగా పూజా హెగ్డే కనిపించనున్నారు.

ఇంతకు ముందు వీరిద్దరు కలిసి మహర్షిలో నటించారు. ఇక మహేశ్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఈ మూవీ మూడోది కాగా.. అంతకు ముందు వీరిద్దరు కలిసి అతడు, ఖలేజా చేశారు. అతడు ఇండస్ట్రీ హిట్ గా నిలవగా.. ఖలేజా డివైడ్ టాక్ సంపాదించుకుంది.

Read more:

ప్రభాస్ వర్సెస్ మహేష్ బాబు.. బిగ్గెస్ట్ క్లాష్

Advertisement

Next Story