టీవీల్లోకి సూపర్ స్టార్ ‘జైలర్’ సినిమా.. ఏ రోజంటే?

by Hamsa |   ( Updated:2023-11-06 07:36:45.0  )
టీవీల్లోకి సూపర్ స్టార్ ‘జైలర్’ సినిమా.. ఏ రోజంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ రజినీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో ఇటీవల ‘జైలర్’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. దీనిని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించగా అనరుధ్ మ్యూజిక్ అందించారు. ఇది రజినీకాంత్ 169వ సినిమాగా ఆగస్ట్ 9న గ్రాండ్‌గా థియేరట్స్‌లో విడుదలైంది. అలాగే ప్రేక్షకుల్లో హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీ కలెక్షన్స్ భారీగా వసూళ్లు చేసి బాక్సాఫీసును బద్దలు కొట్టింది. మొత్తంగా రూ. 650 కోట్ల కలెక్షన్స్ రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా, ఈ సినిమా టీవీల్లో ప్రసారం కానుందని సమాచారం. దీపావళి పండుగ రోజున (నవంబర్12 ఆదివారం) సా.6:30 గంటలకు జెమినీ టీవీలో టెలికాస్ట్ కానుంది. దీంతో ఈ విషయం తెలిసిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మళ్లీ తలైవా సినిమా ఇంట్లోనే చూసి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే రజినీకాంత్ ప్రస్తుతం తన 170వ సినిమా ‘లాల్ సలాం’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ 2024 జనవరిలో విడుదల కానుందని సమాచారం.

Advertisement

Next Story