జనాలు ఇచ్చిన ఆ బిరుదులను విచ్ఛిన్నం చేస్తా: Sunny Leone

by Prasanna |   ( Updated:2023-01-04 10:08:48.0  )
జనాలు ఇచ్చిన ఆ బిరుదులను విచ్ఛిన్నం చేస్తా: Sunny Leone
X

దిశ, సినిమా : ప్రజలు తనపై వేసిన ముద్రను బద్దలు కొట్టి.. తనను కొత్తగా సృష్టించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సన్నీలియోన్ (sunny leone) చెప్పింది. అంతేకాదు ఈ ఏడాది 2023 తన జీవితంలో కొత్త వెలుగులు నింపుతుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. '2023 నాకు మరింత ఉత్సాహాన్నీ ఇస్తుందని బలంగా నమ్ముతున్నా. అభిమానులు మాపై కురిపించే ప్రేమ కోసమే నటీనటులు ఆనందంగా జీవిస్తారన్నది వాస్తవమే. అయితే జనాలు నాకు ఇచ్చిన బిరుదులను విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నా. ఇదే సమయంలో విభిన్న ప్రాజెక్టులను ఎంచుకోవడానికి చేతనైన ప్రయత్నం చేస్తున్నా. బహుముఖ ప్రజ్ఞ కలిగిన ఒక కళాకారిణిగా పేరుగాంచాలనుకుంటున్నా. గత రెండేళ్లలో నా ప్రేక్షకులు బాగా అభివృద్ధి చెందారు. వాళ్లకోసం ఇకపై నేను ఎంచుకునే షోలు, సినిమాలు ఊహించనిరీతిలో అలరించాలన్నదే నా లక్ష్యం. అందుకే మరిన్ని సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా' అంటూ చెప్పుకొచ్చింది. ఇక సన్నీ ప్రస్తుతం టెలివిజన్ నటుడు అర్జున్ బిజ్లానీతో కలిసి రియాలిటీ డేటింగ్ షో స్ల్పిట్స్‌విల్లా ఎక్స్4 (Splitsvilla X4) హోస్ట్‌గా వ్యవహరిస్తోంది.

ఇవి కూడా చదవండి : Mahesh Babu-Trivikram సినిమాలో Allu Arha ?

Advertisement

Next Story