పోర్న్ ఇండస్ట్రీలోకి ధర్మ ప్రొడక్షన్స్, యష్ రాజ్ ఫిలిమ్స్‌.. సన్నీ లియోన్ కామెంట్స్ వైరల్

by Nagaya |   ( Updated:2023-07-15 15:39:51.0  )
పోర్న్ ఇండస్ట్రీలోకి ధర్మ ప్రొడక్షన్స్, యష్ రాజ్ ఫిలిమ్స్‌.. సన్నీ లియోన్ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: ప్రముఖ బడా నిర్మాణ సంస్థలు ధర్మ ప్రొడక్షన్స్, యష్ రాజ్ ఫిలిమ్స్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్. రీసెంట్‌గా ఓ పోడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె.. అడల్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో తన కెరీర్ గురించి మాట్లాడింది. ‘నేను ఇప్పటివరకు ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ నిర్మాణ సంస్థలు, కంపెనీలతో పనిచేశాను. అయితే అందులో బెటర్ ఏది అని అడిగితే.. వాటిని ప్రస్తుతం ఇండియాకు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ లేదా యష్ రాజ్ ఫిల్మ్స్‌తో మాత్రమే పోల్చగలను’ అని చెప్పింది. అలాగే డబ్బుల కోసమే పనిచేసినప్పటికీ ప్రతి ఒప్పందాన్ని జాగ్రత్తగా చదివిన తర్వాతే అంగీకరించేదాన్నని, ఒకవేళ అది నచ్చకపోతే మార్పులు చేస్తే తప్ప సైన్ చేసేదాన్ని కాదని తెలిపింది. చివరగా ఎంత కష్టపడి పనిచేసినా తనకు తాను ప్రయోజనం పొందే పరిస్థితి లేదని, అంతా అభిమానులకోసమేనంటూ ఫన్నీగా చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story