- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంచలన నిర్ణయం తీసుకున్న సన్నీ డియోల్.. ఇకపై ఆ పని చేయనంటూ
దిశ, సినిమా: బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ ప్రస్తుతం ‘గదర్ 2’ విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ఇప్పటికే రూ.500 కోట్ల క్లబ్‌కు చేరువైంది. ఇదిలావుంటే.. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఇకపై తాను సినిమాలు నిర్మించే సాహసం చేయనని చెప్పాడు. ‘నిర్మాతగా నా ప్రస్ధానం ముగిసింది. ఇక నటనపైనే దృష్టిపెడతా. గతంలో నేను ప్రొడ్యూస్ చేసిన ప్రతి సినిమా దివాళా తీయడమే ఇందుకు కారణం. సినిమాలు తీసే పద్ధతి గతంతో పోలిస్తే ఈ పదేండ్లలో చాలా మార్పులకు గురైంది. గతంలో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్ధతో కమ్యూనికేషన్ ఉండేది. కార్పొరేట్లు అడుగుపెట్టిన తర్వాత ఆ సంబంధాలు తెగిపోయాయి. సినిమా ఎన్ని థియేటర్లలో ఆడుతుందనే సమాచారాన్ని కూడా వారు ఇవ్వట్లేదు’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. చివరిసారిగా తన కుమారుడు కరణ్ డియోల్ మూవీ ‘పల్ పల్ దిల్ కే పాస్’ను ఆయన నిర్మించారు.