స్టార్ సింగర్‌కు వార్నింగ్ ఇచ్చిన జాక్వెలిన్‌ ప్రియుడు.. రిపీట్ అయితే నీ బతుకు బజారే అంటూ!

by Satheesh |   ( Updated:2023-10-05 11:30:52.0  )
స్టార్ సింగర్‌కు వార్నింగ్ ఇచ్చిన జాక్వెలిన్‌ ప్రియుడు.. రిపీట్ అయితే నీ బతుకు బజారే అంటూ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తన ప్రియురాలు, బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌పై కామెంట్ చేసిన ప్రముఖ గాయకుడు మికాసింగ్‌కు సుఖేశ్ చంద్రశేఖర్ వార్నింగ్ ఇచ్చాడు.మరోసారి రిపీట్ అయితే పర్యవసానాలు మరోలా ఉంటాయని హెచ్చరించాడు. ఈ వ్యవహారం ప్రస్తుతం వైరల్‌గా మారింది. మనీ లాండరింగ్ కేసులో అరెస్టై ప్రస్తుతం మండోలి జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్.. తన ప్రియురాలిని మికా సింగ్ టీజ్ చేయడంపై తీవ్రంగా స్పందించాడు. ఈ మేరకు ఓ లేఖను రాశాడు. ఇటీవల జాక్వెలిన్.. నటుడు జీన్-క్లాడ్ వాన్ డామ్‌తో కలిసి దిగిన ఫోటోను ఇన్ స్టా గ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోపై మికా సింగ్ స్పందిస్తూ.. నువ్వు అందంగా ఉన్నావ్ సుఖేశ్‌తో పోలిస్తే ఇతను ఇంకా బాగున్నాడు అని కామెంట్ చేశాడు.

దీనిపై స్పందించిన సుఖేశ్.. మికా.. నువ్వు ఏం చేస్తున్నావో నేను గమనిస్తున్నా.. జాక్వెలిన్‌కు ఏం బాగుటుందో చెప్పే అంతటి వాడివా? నీ గురించి అంతా నాకు తెలుసు. మహిళలను ఇబ్బంది పెట్టేలా ప్రవర్తిస్తుంటావు. ఇదే గనుక రిపీట్ అయితే నీ విషయాలన్ని బయటపెడుతా. నువ్వు దివాలా తీసేలా చేస్తా అంటూ హెచ్చరించాడు. కాగా జాక్వెలిన్‌పై ప్రేమతో ఆగస్టు 11న ఆమె పుట్టిన రోజు సందర్భంగా పెటా సంస్థకు రూ.11కోట్లు విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story