బాయ్ ఫ్రెండ్ చీటింగ్‌‌పై స్పందించిన షారుఖ్ కూతురు.. ఇంకా చాలామంది వెయిటింగ్ అంటోంది

by Anjali |   ( Updated:2023-08-30 07:15:41.0  )
బాయ్ ఫ్రెండ్ చీటింగ్‌‌పై స్పందించిన షారుఖ్ కూతురు.. ఇంకా చాలామంది వెయిటింగ్ అంటోంది
X

దిశ, సినిమా : బాయ్ ఫ్రెండ్ ప్రేమించి మోసం చేస్తే తాను ఎలా రియాక్ట్ అవుతానో చెప్పేసింది షారుఖ్ కూతురు సుహానా ఖాన్. ‘ఆర్చీస్’ మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఆమె ఈ మధ్య వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటుంది. ఈ క్రమంలోనే తాజాగా తన కెరీర్ అండ్ పర్సనల్ ఇష్యూస్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ‘నేను ఒక రకం అమ్మాయిని. ఒక పురుషుడిని ఖచ్చితంగా ఇష్టపడే ఒక స్త్రీని. ఇప్పటికే నా వెంటపడుతున్న అబ్బాయిల లిస్ట్ నా దగ్గర ఉంది. నా ఫ్రెండ్స్ అనుభవాల ఆధారంగా చాలా విషయాలు తెలుసుకున్నా.

కాబట్టి బాయ్స్‌కు నేను డైరెక్టుగానే మెసెజ్ పంపాలనుకుంటున్నా. నేను పర్సనల్ లైఫ్ విషయంలో బయట కనిపించేదానికంటే చాలా భిన్నంగా ఉంటాను. చీటింగ్ అసలే సహించను. కారణాలు చెప్పకుండానే వదిలేస్తాను’ అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇదిలావుంటే.. ఇటీవల ఒక పుస్తకావిష్కరణలో మాట్లాడిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ బహిరంగ ప్రదేశాల్లో స్పీచ్ ఇవ్వడాన్ని బట్టి తనలో మెచ్యూరిటీ పెరిగినట్లు అర్థమవుతోందని చెప్పింది.


Advertisement

Next Story