బిచ్చగాళ్లను పండగ చేసుకోమంటున్న షారుఖ్ కూతురు.. (వీడియో)

by Prasanna |   ( Updated:2023-10-10 06:08:58.0  )
బిచ్చగాళ్లను పండగ చేసుకోమంటున్న షారుఖ్ కూతురు.. (వీడియో)
X

దిశ, సినిమా : బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ‘ఆర్చీస్’తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటికే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన యంగ్ గర్ల్.. పలు ఇంటర్నేషనల్ బ్యూటీ ప్రొడక్ట్స్‌కు సైతం అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ భారీగానే సంపాదిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా రెస్టారెంట్‌కు వెళ్లిన సుహాన.. బయటకు వస్తుంటే అక్కడున్న భిక్షగాళ్లు డబ్బులివ్వమని కోరారు. దీంతో పర్సులో నుంచి మనీ తీసిన ఆమె.. ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున ఇచ్చేసింది. దీంతో వాళ్లు హ్యాపీగా కనిపిస్తుండగా.. మొత్తానికి పండగ చేసుకుంటున్నారు అంటున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. తండ్రికి తగ్గ తనయ అని పొగిడేస్తున్నారు.

Read More: అలా చేయడం దేశభక్తి కానే కాదు.. అదా శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

Advertisement

Next Story