హీరో లవర్‌ను రాత్రికి రమ్మన్న సుధీర్.. వీడు మనిషేనా అంటూ కామెంట్స్!

by Jakkula Samataha |
హీరో లవర్‌ను రాత్రికి రమ్మన్న సుధీర్.. వీడు మనిషేనా అంటూ కామెంట్స్!
X

దిశ, సినిమా : బుల్లితెర హీరోగా మంచిపేరు సంపాదించకున్న కమెడియన్ సుడిగాలి సుధీర్. ఈయన కామెడీ, వేసే పంచ్ డైలాగ్స్ అందరినీ తెగ ఆకట్టుకుంటాయి. మరీ ముఖ్యంగా జబర్దస్త్ షోలో ఉన్నప్పుడు, రష్మితో ఎఫైర్ అని వారి మీద తెగ పంచులు వేయడం.. ప్లేబాయ్‌గా సుధీర్ చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది.

ఇక ఈయన జబర్దస్త్‌కు గుడ్ బై చెప్పి ప్రస్తుతం సినిమాలపైన ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తూ తన నటనతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అయితే సుధీర్ ప్రస్తుతం ఆహా వేదికగా సర్కార్ 4 షో చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా విడుదలైన ఈ ప్రోమోలో సుధీర్ తన యాంకరింగ్, కామెడీతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ షోలో లవ్ మీ యూనిట్ టీం.. హీరో ఆశిష్, వైష్ణవి చైతన్య, సిమ్రాన్ చౌదరి, రవికృష్ణ పాల్గొన్నారు. అందులో మొదటగా ఆశిష్ ఎంట్రీ ఇస్తాడు. దీంతో అతన్ని చూసిన సుధీర్ మీరు ఓ వర్గానికి ఇన్సిపిరేషన్ అని చెప్పగా..ఆయన ఎందుకు అంటాడు. దీంతో సుధీర్ దెయ్యాన్ని ప్రేమించడం ఏంటీ భయ్యా అని అడగ్గా.. నేను ప్రేమించిన దెయ్యం, నా దివ్యావతి, ఇక్కడే ఉంది అని చెబుతాడు. అప్పుడు సుధీర్ వెంటనే ఏది ఎక్కడా అని మాట్లాడే ప్రయత్నం చేయగా... అయ్యో ఇప్పుడే వెళ్లిపోయిందని చెప్తాడు ఆశిష్. దీంతో సుధీర్ రాత్రికి రమ్మను భయ్యా అని చెప్పడంతో అక్కడున్న వారందరూ నవ్వుతారు. అంతే కాకుండా బ్యాక్ గ్రౌండ్‌లో ఒరేయ్ నువ్వు మనిషివా.. మృగానివా అనే డైలాగ్ వస్తుంది. దీంతో షో కామెడీగా, సరదాగా సాగుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed