ISRO chief Somanath on Elon Musk :ఎలాన్ మస్క్ ని కొనియాడిన ఇస్రో ఛైర్మన్

by Shamantha N |   ( Updated:2024-10-26 10:53:59.0  )
ISRO chief Somanath on Elon Musk :ఎలాన్ మస్క్ ని కొనియాడిన ఇస్రో ఛైర్మన్
X

దిశ, నేషనల్ బ్యూరో: స్పేస్‌ఎక్స్(SpaceX) అధినేత ఎలాన్‌మస్క్‌ (Elon Musk)పై ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్(ISRO chief S Somanath) ప్రశంసలు కురిపించారు. ఢిల్లీ ఐఐటీలో జరిగిన ప్రోగ్రాంలో మస్క్ వినూత్న ఆలోచనలను కొనియాడారు. ఆయన చేస్తోన్న కృషి వల్లే అంతరిక్ష రంగం ఇప్పుడు ప్రతిఒక్కరినీ ఆకర్షిస్తోందన్నారు. ‘‘స్పేస్‌ఎక్స్ ఇటీవల చాప్‌స్టిక్స్ తరహాలోని మెకానికల్ ఆర్మ్స్‌తో స్టార్‌షిప్‌ రాకెట్ బూస్టర్‌ను పట్టుకుంది. ఇస్రో ఎప్పుడు అలా చేస్తుందని అందరూ ప్రశ్నిస్తున్నారు. మనలో ఒకరైన ఎలాన్‌మస్క్‌ ఈ న్యూ ఐడియాతో అందరినీ ఆశ్చర్యపరిచారు. మస్క్ ఏం చేస్తున్నారని, అతడ్ని మించి ఎలాంటి న్యూ ఐడియాలతో మందుకు రాగలమని అందరూ ఆలోచిస్తున్నారు. అద్భుతమైన పనులు చేస్తున్న గొప్పవ్యక్తి మస్క్ అని నా అభిప్రాయం. ఆయన్ని చూసే మనమంతా ప్రేరణ పొందాం. దానివల్లే అంతరిక్ష రంగం ఇప్పుడు ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తోంది. అంతరిక్ష రంగం ప్రభావం దేశ ఆర్థిక, ఉపాధి కల్పనపై ఉంది. ఈ రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం కోసం కేంద్రం చొరవ తీసుకుంది’’ అని సోమనాథ్‌ అన్నారు.

స్పేస్ ఎక్స్ న్యూ లాంచ్

ఇకపోతే, స్పేస్‌ఎక్స్‌ సంస్థ అంతరిక్ష ప్రయోగ రంగంలో ఇటీవల సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇటీవలే ప్రయోగించిన భారీ స్టార్‌షిప్‌ రాకెట్‌ బూస్టర్‌ నింగిలోకి దూసుకెళ్లి, ఆ తర్వాత లాంచ్‌ప్యాడ్‌ (లాంచ్‌టవర్‌) వద్దకు సురక్షితంగా చేరుకుంది. ఇటీవల బూస్టర్, వ్యోమనౌక స్టార్‌షిప్‌ రాకెట్ను నింగిలోకి ప్రయోగించారు. నింగిలోకి ఎగిరిన 7 నిమిషాల తర్వాత బూస్టర్‌ క్రమంగా కిందకు దిగుతూ లాంచ్‌టవర్‌కు సురక్షితంగా తిరిగొచ్చింది. చాప్‌స్టిక్స్‌లా పనిచేసే మెకానికల్ ఆర్మ్స్‌తో లాంచ్‌టవర్‌ దాన్ని పట్టుకుని రికార్డు సృష్టించింది. దీంతో, ప్రశంసలు వెల్లువెత్తాయి.

Advertisement

Next Story

Most Viewed