- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
PM Modi : సంస్కృతిని చాటి చెప్పిన గొప్ప కళాకారుడు కనకరాజు
దిశ, ఉట్నూర్ : గుస్సాడీ (దండారి)ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప కళాకారుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు (Kanakaraju)అని ప్రధాని మోడీ (Prime Minister Modi)ఎక్స్ వేదికగా శనివారం సంతాపాన్ని ప్రకటించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు అనారోగ్య కారణంగా శుక్రవారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి గ్రామం(Marlavai village)లో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.
కాగా, దేశ ప్రధాని మోడీ, సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు సంతాపాన్ని ప్రకటించారు. అద్భుతమైన నృత్యకారుడు, సాంస్కృతిక దిగ్గజం కనకరాజు అని కొనియాడారు. గుస్సాడీ నృత్యాన్ని పరిరక్షించడంలో ఆయన అందించిన సహకారం మరువలేనిదన్నారు. ఆయన అంకితభావం, అభిరుచి, సాంస్కృతిక వారసత్వం అభినందనీయమన్నారు. కనకరాజు మృతిపై ఆయన కుటుంబ సభ్యులకు మోడీ సానుభూతి తెలిపారు.
- Tags
- PM Modi