- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
సోషల్ మీడియాలో ప్రణీత్ హనుమంత్ రావుపై గరం గరం.. క్లారిటీ ఇచ్చిన సుధీర్ బాబు
దిశ, సినిమా: తండ్రి, కూతురు మధ్య ఉండే పవిత్ర బంధంపై డార్క్ కామెడీ చేసిన ప్రణీత్ హనుమంత్ రావు అండ్ బ్యాచ్ పై ఇప్పటికే సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. పొట్టు పొట్టు తిట్టి పోస్తున్నారు నెటిజన్లు. అయితే ఈ వ్యక్తి తాజాగా సుధీర్ బాబు హీరోగా వచ్చిన 'హరోం హర' చిత్రంలో నటించాడు. ఈ క్రమంలో ఈ సంఘటనపై స్పందించాడు హీరో. ' మంచో చెడో నేను సోషల్ మీడియా పర్సన్ కాదు. హనుమంత్ రావు గురించి నాకు ముందు తెలియలేదు. అందుకే మా చిత్రంలో తీసుకున్నాం. ఇందుకు నేను, నా టీమ్ మొత్తం మీకు క్షమాపణలు చెప్తుంది. ఈ జబ్బుపడిన మనుషులు ఇలాంటి డార్క్ కామెడీని స్ప్రెడ్ చేయకుండా ఉండాలంటే.. ఇందుకు ఏ ప్లాట్ ఫామ్ సపోర్ట్ చేయకూడదు. ఇది వాక్ స్వాతంత్ర్యం కాదు ' అని పోస్ట్ పెట్టాడు.
కాగా దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఇందులో మీ తప్పు లేదు అని సుధీర్ బాబును సమర్థిస్తున్నారు. హన్మంతు రావు లాంటి నీచులకు ఫ్యూచర్ ఉండకూడదు అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులను ఎంకరేజ్ చేయకూడదని కోరుతున్నారు.