ఆయన బయోపిక్ తెరకెక్కించే ఆలోచన లేదు: క్లారిటీ ఇచ్చిన దర్శకురాలు

by Hamsa |   ( Updated:2022-12-05 14:27:09.0  )
ఆయన బయోపిక్ తెరకెక్కించే ఆలోచన లేదు: క్లారిటీ ఇచ్చిన దర్శకురాలు
X

దిశ, సినిమా : తమిళ్ స్టార్ డైరెక్టర్ సుధా కొంగర ఎట్టకేలకు రతన్ టాటా బయోపిక్‌పై స్పందించింది. గత కొంతకాలంగా ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త జీవిత కథ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కించబోతున్నట్లు టాక్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయిన దర్శకురాలు.. ఈ వార్తల్లో నిజం లేదని కొట్టిపారేసింది. 'నేను రతన్ టాటాకు వీరాభిమానినే. కానీ, ఆయన బయోపిక్ తెరకెక్కించే ఆలోచన లేదు. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ చిత్రాలను తెరకెక్కించే పనిలో ఉన్నా. త్వరలోనే నా కొత్త సినిమా వివరాలు అధికారికంగా వెల్లడిస్తా' అని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆమె సూర్య నటించిన 'ఆకాశమే హద్దురా(సురారై పొట్రు)' చిత్రాన్ని హిందీలో రిమేక్ చేస్తుండగా.. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తోంది.


Advertisement

Next Story