నటుడు ప్రకాష్ రాజ్ కూర్చున్న కుర్చీలో మూత్రం పోసిన విద్యార్థులు.. అంత కోపం ఎందుకంటే..?

by sudharani |
నటుడు ప్రకాష్ రాజ్ కూర్చున్న కుర్చీలో మూత్రం పోసిన విద్యార్థులు.. అంత కోపం ఎందుకంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: సినీయర్ నటుడు ప్రకాష్ రాజ్ గురించి అందరకీ తెలిసిందే. ఫ్యామిలీ సినిమాలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఆయన.. విలన్‌గా కూడా మంచి క్రేజ్ పొందారు. నిత్యం సోషల్ మీడియాలో బిజీగా ఉండే ప్రకాష్.. రాజకీయ విషయాలపై స్పందిస్తూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అయినప్పటికీ ఏ మాత్రం తగ్గకుండా మోడీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉంటారు. అయితే ఇప్పటి వరకు ప్రకాష్ రాజ్‌పై రాజకీయపరంగా మాత్రమే వివాదాలు చుట్టుముట్టాయి. కానీ.. తాజాగా స్టూడెంట్స్‌కు కూడా ఆయనపై నిరసనకు దిగారు. వివరాల్లోకి వెళితే..

కర్ణాటకలో శివమొగ్గ జిల్లాలోని సర్ ఎంవి ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీలో ‘డైలాగ్ ఆన్ థియేటర్, సినిమా అండ్ సొసైటీ’ అనే కార్యక్రమం నిర్వహించారు. దీనికి ప్రకాష్ రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అయితే.. ఈ కార్యక్రమానికి కాలేజీ విద్యార్థులను అనుమతించలేదు. అంతేకాకుండా స్టూడెంట్స్ ఆడిటోరియంలోకి రాకుండా పోలీస్ బందోబస్త్ కూడా ఏర్పాటు చేశారు. దీంతో స్టూడెంట్స్ ఆడిటోరియం బయట ఆందోళనలు చేపట్టారు. వీరికి బీజేపీ నేతలు కూడా మద్దతుగా నిలిచారు.

విద్యార్థులని అనుమతించని కార్యక్రమం కాలేజీలో ఎందుకు నిర్వహించారు.. ప్రైవేట్ కార్యక్రమం అయితే ఇంకెక్కడైనా చేసుకోవచ్చు కదా అంటూ స్టూడెంట్స్ ప్రశ్నించారు. అయితే విద్యార్థుల నిరసనకు స్పందించకుండా ప్రకాష్ రాజ్ ఆ ఈవెంట్‌లో ప్రసంగించి వెళ్లిపోయారు. దీంతో ప్రకాష్ రాజ్ ఆడిటోరియం నుంచి వెళ్ళిపోగానే ఆయన కూర్చున్న కూర్చీలో, అలాగే ప్రసంగించిన ప్రాంతాన్ని కొందరు విద్యార్థులు గోమూత్రంతో శుద్ధి చేసింది. అంతే కాకుండా.. గోమూత్రాన్ని నీటిలో కలిపి ఆడిటోరియం మొత్తాన్ని శుద్ధి చేశారు విద్యార్థులు. దీంతో ఈ షాకింగ్ ఘటన ప్రస్తుతం వార్తల్లో నిలిచింది.

Advertisement

Next Story

Most Viewed