- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అభిమానులకు అజిత్ భార్య షాలిని స్ట్రాంగ్ వార్నింగ్.. కారణం తెలిస్తే షాక్!
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ భార్య షాలిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రముఖ నటులతో తమిళ సినిమాలో ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి ఫేమస్ అయి.. తర్వాత కాలంలో హీరోయిన్ అయింది షాలిని. ఈమె తమిళ సినిమాల్లోనే కాకుండా మలయాళం, తెలుగు, కన్నడ వంటి భాషలలో కూడా ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పి్ంచింది. అదేవిధంగా టీనేజ్ వచ్చిన తర్వాత షాలిని మలయాళంలో బాసిల్ దర్శకత్వంలో దళపతి విజయ్ సరసన హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన షాలిని ఆ తర్వాత అజిత్ సరసన అమర్కలం, మాధవన్ సరసన అలైపాయుతే వంటి కొన్ని సినిమాలతో హిట్ కొట్టింది. తర్వాత థాలా అజిత్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. పెళ్లయ్యాక సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైన షాలిని ఇన్నాళ్లుగా సోషల్ మీడియాలో కూడా కనిపించడం లేదు.
అయితే రెండేళ్లుగా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ప్రారంభించి దాని ద్వారా తన ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఫోటోలు షేర్ చేస్తోంది. ఈ సందర్భంలో, షాలిని పేరును దుర్వినియోగం చేస్తూ, ఒక రహస్య వ్యక్తి ఆమె పేరు మీద నకిలీ X పేజీని(ట్విట్టర్) సృష్టించాడు. దాదాపు 80.1K మంది ఫాలోవర్స్ షాలిని X పేజీగా భావించి ఫాలో అవుతున్నారు. ఈ సమాచారాన్ని షాలిని దృష్టికి తీసుకెళ్లగా ఆమె దాని గురించి వార్నింగ్ పోస్ట్ చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఫేక్ ఎక్స్ పేజీ స్క్రీన్ షాట్ పోస్ట్ చేసి ఇది తన అధికారిక ఎక్స్ పేజి కాదని, కాబట్టి ఎవరూ ఫాలో చేయవద్దని అభిమానులను హెచ్చరించడం జరిగింది. దీంతో అభిమానులు ఇన్ని రోజులు ఫాలో అవుతున్నది షాలినిని కాదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.