- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టికెట్స్ కొన్నవారే రివ్యూ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి: విశ్వక్సేన్ సంచలన కామెంట్స్
దిశ, సినిమా: విశ్వక్సేన్ హీరోగా తాజాగా విడుదలైన మూవీ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. మే 31న శుక్రవారం థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. కాగా విశ్వక్సేన్ సరసన నేహా శెట్టి నటించగా అంజలి ముఖ్య పాత్రను పోషించింది. ఈ సినిమాను ఛల్ మోహన్ రంగ సినిమా ఫేమ్ కృష్ణ చైతన్య తెరకెక్కించగా.. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై నిర్మాత నాగ వంశీ గ్రాండ్ గా నిర్మించారు. ఈ సినిమా కథ పాతది అయినా కూడా దర్శకుడు కృష్ణ చైతన్య తన టేకింగ్ తో అదరగొట్టాడు.
ఇదిలా ఉండగా సినిమా ఇండస్ట్రీలో కొంతకాలంగా రివ్యూలపై చర్చ జరుగుతోంది. మరోవైపు కొంతమంది సినిమా చూడకముందే రివ్యూలు ఇస్తూ సినిమా ఫలితంపై దెబ్బతీస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఇదే అంశంపై హీరో విశ్వక్సేన్ కూడా స్పందించారు. ఆయన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు వస్తోన్న రెస్పాన్స్.. రివ్యూపై మాట్లాడుతూ.. కొందరు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చూడకుండానే ఉదయం 6 గంటలకే రివ్యూ రాశారని విశ్వక్ గుర్తు చేశారు.
అలాగే సినిమాకు ప్రధాన బలమైన మ్యూజిక్ బాలేదు అంటూ రివ్యూలో ఉందని.. అదే బాలేదు అన్నారంటే వారు సినిమా చూడలేదని అక్కడే అర్థమైందని విశ్వక్ సేన్ పేర్కొన్నారు. సినిమాను చూసి అందులోని వీక్ పాయింట్‌ను ప్రస్తావిస్తూ రివ్యూస్ రాస్తే తప్పు లేదు కానీ.. ఇలా చూడకుండా రివ్యూ ఇవ్వడం ఏమాత్రం సబబు కాదన్నారు. ఈ మేరకు టికెట్స్ కొన్నవారే 'బుక్‌మై షో'లో రివ్యూలు రాసుకునేందుకు వీలుగా ఉండేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందన్నారు.