పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్ ఇలియానా..! పోస్ట్ వైరల్

by Hamsa |   ( Updated:2023-04-18 14:17:37.0  )
పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్ ఇలియానా..! పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: స్టార్ హీరోయిన్ ఇలియానా, రామ్ పోతినేని ‘దేవదాసు’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు స్టార్ హీరోలు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి స్టార్స్‌తో నటించి ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే రీసెంట్‌గా హీరోయిన్ కత్రినా కైఫ్ బ్రదర్‌తో రిలేషన్ షిప్‌లో ఉందనే రూమర్స్ వచ్చాయి. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్‌లు లేకపోవడంతో సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ ఆసక్తికర పోస్టులు పెడుతోంది. తాజాగా, ఇలియానా తన ఇన్‌స్టాగ్రామ్‌లో తాను ప్రెగ్నెన్సీగా ఉన్నట్లు ఓ పోస్ట్ పెట్టి సంచలనం సృష్టించింది. తాను ప్రెగ్నెన్సీ తో ఉన్నట్లు ఇలియానా చిన్న పిల్లల టీ షర్ట్ ఫొటోను షేర్ చేస్తూ ‘‘ కమింగ్ సూన్. నిన్ను కలవడానికి వేచి ఉండలేకపోతున్నా డార్లింగ్’’ అనే క్యాప్షన్‌ను జత చేసింది. దీనికి ఇలియానా తల్లి ‘గ్రాండ్ బేబీ నిన్ను చూడటానికి వేచి ఉండలేను’ అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో అది చూసిన నెటిజన్లు షాక్ అవుతూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

Also Read.. స్టేడియంలో బూతులు మాట్లాడిన షారుఖ్ కూతురు.. ‘ఫక్’ అంటూ


Advertisement

Next Story