- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ambani కుటుంబంతో చేతులు కలిపిన స్టార్ హీరోయిన్ Alia Bhatt!
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. బిజినెస్ బాధ్యతల్లో నిమగ్నమవుతూనే సినిమాల్లోనూ రాణిస్తున్నారు. తాజాగా ఈ భామ మరో కొత్త బిజినెస్‌లోకి అడుగు పెట్టినట్లు తెసుస్తోంది. ప్రపంచంలోనే రిచ్చెస్ట్ పర్సన్స్ అయిన ముఖేష్ అంబానీ కుటుంబంతో కలిసి ఈ చిన్నది వ్యాపారం స్టార్ట్ చేసింది. ఈసారి తన బ్రాండ్‌ను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడానికి అంబానీ కుటుంబంతో చేతులు కలిపిందట. కాగా ముఖేష్ అంబానీ ముద్దుల తనయ ఇషా అంబానీతో ఆమె కొలాబరేట్ అయ్యింది. బూట్‌స్ట్రాప్డ్ వెంచర్ ఎడ్-ఎ-మమ్మా, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ రెండు చేతులు కలిపాయని, ఇకనుంచి ఇద్దరం కలిసి బిజినెస్ కొనసాగిస్తామని అలియా సోషల్ మీడియాలో వెల్లడించింది. ఇషా అంబానీతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. తల్లులమైన తామిద్దరం కలిసి.. ఇలా ఈ వ్యాపారం చేయడం ఎంతో హ్యాపీగా ఉందని తెలిపింది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.