Theatre Movies: ఆగస్ట్ 15 నే టార్గెట్ చేస్తున్న స్టార్ హీరోలు.. 5 కొత్త సినిమాలు విడుదల

by Prasanna |
Theatre Movies: ఆగస్ట్ 15 నే టార్గెట్ చేస్తున్న స్టార్ హీరోలు.. 5 కొత్త సినిమాలు విడుదల
X

దిశ, సినిమా : కల్కి సినిమా భారీ హిట్ అవ్వడంతో సినిమా మార్కెట్ కూడా అమాంతం పెరిగింది ఎప్పుడెప్పుడు సినిమాలను విడుదల చేద్దామా అని స్టార్ హీరోలు వేచి చూస్తున్నారు. ఈ సారి అందరి చూపు ఆగస్టు 15 పైనే పడింది. మూవీ లవర్స్ కి పండగే పండగ. ఆ రోజున పెద్ద ఫెస్టివల్లే జరగబోతుంది ఎందుకంటే ఐదు భారీ ప్రాజెక్ట్స్ పోటీకి సిద్దంగా ఉన్నాయి. టాలీవుడ్ , కోలీవుడ్, బాలీవుడ్, స్టార్ హీరోలు నటించిన ఈ సినిమాలు ఆగస్టు 15న రిలీజ్ అవ్వనున్నాయి. ఆ సినిమాలేంటో ఇక్కడ చూద్దాం..

డబుల్ స్మార్ట్

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ నటిస్తున్న "డబుల్ ఇస్మార్ట్" కూడా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటించారు.

మిస్టర్ బచ్చన్

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా "మిస్టర్ బచ్చన్ ". యాక్షన్ ఫిల్మ్ గా రూపొందిన ఈ మూవీ ఆగస్టు 15న రిలీజ్ కానుంది.

వేద

నిఖిల్ అద్వానీ డైరెక్షన్లో వస్తున్న జాన్ అబ్రహం, శర్వరీ బాగ్ జంటగా నటించిన మూవీ "వేద" ఈ మూవీలో తెలుగు స్టార్ హీరోయిన్ తమన్నా కూడా ముఖ్య పాత్రలో నటిస్తోంది. ఆగస్టు 15న ఈ మూవీ థియేటర్లో సందడీ చేయనుంది.

స్త్రీ 2

రాజ్‌కుమార్ రావు హీరోగా, శ్రద్ధా కపూర్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న మూవీ "స్త్రీ 2". అమర్ కౌశిక్ దర్శకత్వంతో వస్తున్న ఈ మూవీ ఆగస్టు 15న రిలీజ్ అవ్వనుంది.

తంగలాన్

ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న " తంగలాన్ " మూవీ ఆగస్టు 15న రిలీజ్ అవ్వనుంది. ఈ మూవీలో చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన మూవీ ట్రైలర్ భారీ హైప్ క్రియేట్ చేసి అంచనాలను పెంచేసింది.

Advertisement

Next Story