Abbas :: ఆ అమ్మాయి కోసం సూసైడ్ చేసుకోవాలనుకున్న ప్రేమదేశం మూవీ హీరో?

by Prasanna |   ( Updated:2023-07-19 05:57:46.0  )
Abbas :: ఆ అమ్మాయి కోసం సూసైడ్ చేసుకోవాలనుకున్న ప్రేమదేశం మూవీ హీరో?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రేమ దేశం సినిమాలో నటించిన అబ్బాస్ మనందరికీ సుపరిచితమే. అప్పట్లో హీరో అబ్బాస్ స్టైల్ కి చాలామంది యూత్ ఫిదా అయ్యారు. అలాంటి అబ్బాస్ ప్రేమదేశం సినిమాతో ఫేమస్ అయ్యారు. ఈ సినిమాతో వినీత్, టబూ,డైరెక్టర్ కధీర్, అబ్బాస్ ఇలా అందరికి మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఈ సినిమాలోని పాటలన్ని హిట్ అయ్యాయి. ఈ సినిమా తర్వాత అబ్బాస్ కి వరుస సినిమా ఆఫర్లు వచ్చాయి. కథలు ఎంచుకునే విషయంలో తప్పు చేయడం వల్ల సినిమాలన్ని ప్లాప్ అయ్యాయి. సినిమా ఆఫర్లు తగ్గిపోవడంతో సైడ్ క్యారెక్టర్లు కూడా చేశారు.

ఈ మధ్యకాలంలో ఇండియాకి వచ్చిన అబ్బాస్.. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు బయటకు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. నేను పదో తరగతి ఫెయిల్ అయినప్పుడు చనిపోవాలనుకున్నాను.. అదే సమయంలో నేను ప్రేమించిన అమ్మాయి కూడా దూరం కావడంతో ఆ బాధ మరింత ఎక్కువై ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలకు మరింత బలం చేకూరిందని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి: చిన్నారి కష్టం చూసి కన్నీరు పెట్టిన RP Patnayak.. సంచలన నిర్ణయం (వీడియో)

Advertisement

Next Story