ఆ పూజారి మాటలు విని.. భార్యను ఆరు నెలలు దూరం పెట్టిన స్టార్ హీరో!

by Jakkula Samataha |
ఆ పూజారి మాటలు విని.. భార్యను ఆరు నెలలు దూరం పెట్టిన స్టార్ హీరో!
X

దిశ, సినిమా : చిత్ర పరిశ్రమలో నటీ నటులకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతూ ఉంటుంది. ఇక ఈ మధ్య చాలా మంది స్టార్ సెలబ్రిటీస్ జాతకాలు చూపెట్టుకోవడం, వాటి పరిహారాలు చేయడం చాలా కామన్ అయిపోయింది.

సినిమా హిట్ కావడానికి కొంత మంది స్టార్ సెలబ్రిటీస్ ఏవేవో పూజలు చేస్తున్న ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే ఓపాన్ ఇండియా హీరో తన సినిమా సక్సెస్ కావడానికి భార్యను ఏకంగా ఆరు నెలలు దూరం పెట్టాడంట.

అసలు విషయం‌లోకి వెళ్తే.. మంచి ఫ్యాన్ పాలోయింగ్ ఉన్న స్టార్ హీరో, తన భార్యతో ఎప్పుడూ వెకేషన్స్‌కు వెళ్తూ ఏంజాయ్ చేస్తుంటాడంట.అంతేకాకుండా తాను, తన భార్య చాలా స్టైలిష్‌గా ఉంటారంట. అయితే అలాంటి స్టార్ హీరో తన పాన్ ఇండియా మూవీ మంచి హిట్ అందుకోవాలని పూజలు చేయించుకున్నాడంట.

ఓ పూజారిని తన గెస్ట్ హౌస్‌కు రప్పించి ప్రత్యేక పూజలు చేయించాడంట. ఈ క్రమంలోనే ఆ అయ్యగారు ఈ మూవీ హిట్ కావాలంటే, మీరు మీ భార్యకు ఆరు నెలలు దూరంగా ఉండాలని చెప్పాడంట. దీంతో సినిమా హిట్ కోసం ఆ స్టార్ హీరో తన భార్యకు, పిల్లలకు ఆరునెలలు దూరంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story