CM రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన స్టార్ హీరో.. వీడియోతో క్లారిటీ!

by Anjali |
CM రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన స్టార్ హీరో.. వీడియోతో క్లారిటీ!
X

దిశ, వెబ్‌డెస్క్: భారతీయుడు-2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో టాలీవుడ్ హీరో సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఇటీవల సినిమా టీమ్స్ టికెట్ రేట్ల పెంపు కోసం ప్రభుత్వాన్ని ఆశ్రయించినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సోషల్ మీడియా అవగాహన కోసం పలు వీడియోలు చేయాలని సూచించిన విషయం తెలిసిందే. దీనిపై ‘భారతీయుడు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కమల్ హాసన్ ను ఓ విలేఖరి ప్రశ్నించగా.. దానికి హీరో సిద్ధార్థ్ సమాధానం చెప్పారు. ‘సామాజిక బాధ్యత ఎవరో గుర్తు చేస్తే రాదని సీఎం వ్యాఖ్యలపై సినీనటుడు సిద్ధార్థ్ విమర్శలు చేశారు. మీరిది చేస్తేనే మేమది చేస్తామని మాకెవరూ చెప్పలేదని అన్నారు. ప్రస్తుతం తన మాటలు నెట్టింట వైరల్ అవ్వడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మర్యాద ఇవ్వడమే కాకుండా వ్యతిరేకంగా మాట్లాడాడంటూ సిద్ధార్థ్ ను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. తాజాగా సిద్ధార్థ్ ఈ ట్రోలింగ్ పై స్పందించి.. రేవంత్ రెడ్డిని విమర్శించడం నా మాటల ఉద్దేశం కాదని క్లారిటీ ఇచ్చారు. నా మాటలను మీరు తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. డ్రగ్స్ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రేవంత్ రెడ్డికి నా సపోర్ట్ వంద శాతం ఉంటుందని వెల్లడించారు. పిల్లల భవిష్యత్తు కాపాడుకోవడం మన రెస్పాన్సిబిలిటీ అని అన్నారు. సమాజం మంచి దారిలో వెళ్లడం కోసం సినీ ఇండస్ట్రీ పనిచేయాలన్నారు’’. ప్రస్తుతం సిద్ధార్థ్ తన మాటల వెనక అర్థం చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed