నిజామాబాద్ కొత్త మున్సిపల్ కమిషనర్ ఎవరో తెలుసా..?

by Naveena |   ( Updated:2024-10-28 15:44:43.0  )
నిజామాబాద్ కొత్త మున్సిపల్ కమిషనర్ ఎవరో తెలుసా..?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ అక్టోబర్ 28: నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ మంద మకరందును రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ మంద మకరందును రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.సోమవారం రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసిన 13 మంది ఐఏఎస్ లలో నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ మంద మకరందు కూడా ఉన్నారు. బదిలీల్లో భాగంగా నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న మంద మకరందును హైదరాబాదులోని సీసీఎల్ఏ కార్యాలయం ప్రాజెక్టు డైరెక్టర్ గా ప్రభుత్వం నియమించింది. మంద మకరందు స్థానంలో మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా పరిషత్ సీఈవో దిలీప్ కుమార్ ను నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ గా బదిలీ చేసింది. ఇటీవల మున్సిపల్ రెవెన్యూ అధికారి నరేందర్ ఏసీబీ కి పట్టుబడిన తరువాత మున్సిపల్ కార్పొరేషన్ లో అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రపంచానికి అర్థమైంది. కార్పొరేషన్ పరువు బజారున పడింది. ఈ మచ్చను చెరిపేయడానికి కమిషనర్ మకరందు తనదైన శైలిలో పాలన పరంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ అధికారుల్లో జవాబుదారీ తనాన్ని పెంచుతున్నారు. నగర ప్రజలతో మమేకమవుతూ కార్యాలయానికి వచ్చిన వారి పనుల్లో జాప్యం లేకుండా పరిష్కారమయ్యేలా చొరవ చూపుతున్నారు. ప్రతిరోజూ నగరంలో క్షేత్రస్థాయిలో పర్యటనలు జరుపుతూ సిబ్బందికి పని సంస్కృతి పట్ల జవాబుదారీగా ఉండేలా చూస్తున్నారు. ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇప్పుడిప్పుడే కార్పొరేషన్ పాలనపై పట్టు బిగిస్తున్న సమయంలో ప్రభుత్వం కమిషనర్ మకరందును బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. కమిషనర్ మకరందు 2020 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన వారు కాగా..ఆయన స్థానంలో నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ గా కొత్తగా బాధ్యతలు స్వీకరించనున్న దిలీస్ కుమార్ కూడా 2020 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన వారే కావడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed