- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రేక్షకులను ఫూల్స్ చేసిన స్టార్ హీరోల చిత్రాలివే?
దిశ, వెబ్‌డెస్క్: పలు చిత్రాలు ఆడియన్స్‌ను అలరించినప్పటికీ.. మరికొన్ని సినిమాలు ప్రేక్షకులను గందరగోళంలో పడేస్తాయి. ప్రేక్షకులు మూవీలో లీనమై చూస్తుండగా.. తర్వాత ఇదంతా అబద్ధమని చెబుతారు. అప్పటి వరకు చూసిన ప్రేక్షకులు కొంతమందైతే కోపానికి వస్తుంటారు. డైరెక్టర్లను దారుణంగా తిట్టిపోస్తారు. అలాంటి సినిమాల గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం..
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘నేనొక్కడినే’ చిత్రం ప్రేక్షకులను పూల్స్ చేసింది. ఇందులో మహేష్ బాబు తల్లిదండ్రులను చంపిన క్యారెక్టర్ గురించి అబద్ధం చెప్పి నమ్మిస్తారు. క్లైమాక్స్‌లో అసలు నిజం చెప్తారు. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘డార్లింగ్’ మూవీ కూడా ఫస్ట్ ఆఫ్ ఎంతో బాగుంటుంది. సెకండ్ హాఫ్‌కు వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్‌లో జరిగిందంతా అబద్ధమని హీరో చెప్పేసరికి ఆడియన్స్ షాక్ అవుతారు. అలాగే రవితేజ ‘ఖిలాడి’ చిత్రం ప్రేక్షకులను ఫుల్ కన్‌ప్యూజ్ చేస్తుంది. రవితేజ జైల్లో ఉండి.. చెప్పే కథంతా కూడా ఫేక్ అని ఆ తర్వాత తెలుస్తుంది.
రీసెంట్‌గా విడుదలైన తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన ‘‘లియో’’ చిత్రం కూడా ఇదే కోవకు చెందింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి టాక్ తెచ్చుకోగా.. ఈ సినిమాలో వచ్చిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతా నిజం కాదని నెట్టింట ఓ రూమర్ వినిపిస్తుంది. అసలు విషయం దాచిపెట్టారని జనాలు చర్చిస్తున్నారు. ఇక రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘పేట’ సినిమాలో విలన్‌గా నటించిన విజయ్ సేతుపతికి, రజనీకాంత్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చెబుతారు. లాస్ట్‌కు అదంతా అబద్ధమని తెలుస్తోంది. అలాగే యంగ్ హీరో ‘అడివి శేష్’ నటించిన ‘ఎవరు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించింది. ఇందులో హీరో ఫ్లాష్ బ్యాక్‌ను వేరే అతనిదిగా చూపించి.. ప్రేక్షకులను ఫూల్స్ చేశారు. 2012లో రిలీజైన ‘విజయ్ సేతుపతి’ ‘పిజ్జా’ మూవీ కూడా ప్రేక్షకులను పూల్స్ చేసిందని సోషల్ మీడియాలో నెటిజన్లు ముచ్చటిస్తున్నారు.