స్టార్ హీరో ధనుష్ బర్త్ డే.. ఫుల్ మాస్ యాక్షన్స్‌తో ‘Captain Miller’ టీజర్ రిలీజ్

by Hamsa |   ( Updated:2023-10-10 15:15:00.0  )
స్టార్ హీరో ధనుష్ బర్త్ డే.. ఫుల్ మాస్ యాక్షన్స్‌తో ‘Captain Miller’ టీజర్ రిలీజ్
X

దిశ, వెబ్ డెస్క్: తమిళ స్టార్ హీరో ధనుష్ ఇటీవల ‘సార్’ సిరిమాతో పెద్ద హిట్ అందుకుని అదే ఫామ్‌లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ధనుష్ నటిస్తున్న చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’. దీనిని డైరెక్టర్ అరుణ్ మాతేశ్వరన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అలాగే ఈ చిత్రంలో ధనుష్ జోడీగా ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ భారీ అంచనాలు పెంచేశాయి.

తాజాగా, జూలై 28న నేడు ధనుష్ పుట్టిన రోజు కావడంతో అభిమానులకు ట్రీట్ ఇస్తూ చిత్ర యూనిట్ ‘కెప్టెన్ మిల్లర్’ టీజర్ విడుదల చేశారు. ఇందులో మొత్తం పోరాట సన్నివేశాలు.. యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. బ్రిటిష్ వాళ్లకు.. కెప్టెన్ మిల్లర్ కి మధ్య జరిగే కథలా ఉంది. ఇందులో ధనుష్ ఫుల్ మాస్ యాక్షన్ సీన్స్ చేయబోతున్నట్లుగా టీజర్ చూస్తే తెలుస్తోంది. కాగా, ఈ సినిమా డిసెంబర్ 15న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్నట్లు సమాచారం.

Advertisement

Next Story