ఇటు ఇల్లాలు-అటు ప్రియురాలు.. నెట్టింట హాట్ టాపిక్‌గా స్టార్ హీరో ప్రైవేట్ వ్యవహారం!

by Anjali |
ఇటు ఇల్లాలు-అటు ప్రియురాలు.. నెట్టింట హాట్ టాపిక్‌గా స్టార్ హీరో ప్రైవేట్ వ్యవహారం!
X

దిశ, సినిమా: తాజాగా కన్నడ స్టార్ హీరో దర్శన్ వ్యక్తిగత వ్యవహారం సోషల్ మీడియాలో రచ్చకు దారి తీసింది. ఈ హీరో సతీమణి విజయలక్ష్మి తాజాగా తన భర్త దర్శన్, కొడుకు ఖఉషితో ఉన్న ఫొటో నెట్టింట షేర్ చేసి.. ‘ఇది మా కుంటుంబ. మా వన్ అండ్ ఓన్లీ తో’ అని క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌కు దర్శన్ రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ పవిత్ర గౌడ్ ‘‘మా బంధానికి పదేళ్లు. లవ్ ఫర్ ఎవర్’’ అని ఈ హీరోతో సన్నిహితంగా ఉన్న ఓ ఫొటోను నెట్టింట పంచుకుంది. ప్రస్తుతం.. ఇటు భార్య అటు గర్ల్ ఫ్రెండ్ పవిత్ర గౌడ్ మధ్య సోషల్ మీడియాలో యుద్ధం జరుగుతోంది. సోషల్ మీడియా వేదికన కొట్టుకుంటున్నారు.

గతంలో విజయలక్ష్మి భర్త దర్శన్ మీద గృహ హింస కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్శన్ 14 రోజులు జైలుకు కూడా వెళ్లాడు. ఇక ఆ తర్వాత ఇద్దర కాంప్రమైజ్ అయ్యారు. 2015లో దర్శన్-పవిత్ర గౌడ్ మధ్య లవ్ ఎఫైర్ ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఇక 2017లో పవిత్ర దర్శన్‌తో క్లోజ్‌గా ఉన్న ఓ ఫోటో నెట్టింట పోస్ట్ చేసింది. ఈ ఫొటోపై దర్శన్ అభిమానులు మండిపడటంతో వెంటనే డిలీట్ చేసింది.

కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న దర్శన్‌కు భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. స్టార్ హీరోల్లో ఈయన ఒకరు. దర్శన్ రీసెంట్‌గా కాటేరా అనే చిత్రంలో నటించారు. 200 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో భార్య విజయలక్ష్మి, ప్రేయసి పవిత్ర గౌడ్ కారణంగా ఈ సినిమా సక్సెస్‌ను కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఈ కారణంగా దర్శన్ కాటేరా సక్సెస్ మీట్ చివరి నిమిషంలో క్యాన్సిల్ చేసుకున్నారట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.


Advertisement

Next Story

Most Viewed