Bigg Boss : నాగార్జున మాస్టర్ ప్లాన్.. బిగ్ బాస్ హౌస్‌లోకి స్టార్ హీరో?

by Jakkula Samataha |
Bigg Boss : నాగార్జున మాస్టర్ ప్లాన్.. బిగ్ బాస్ హౌస్‌లోకి స్టార్ హీరో?
X

దిశ, సినిమా : తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న షో ఏదైనా ఉందా అంటే అది బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో కోసమే. మరో నెల రోజుల్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం కానుంది. దీంతో అందరూ హౌస్‌లోకి ఎవరెవరు వెళ్లబోతున్నారు, ఈ సారి హోస్టుగా ఎవరు చేస్తున్నారు అనే విషయం తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇక జూలై21న నాగార్జున బిగ్ బాస్‌కు సంబంధించిన ప్రోమో లాంచ్ చేయడంతో అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. ఈ సారి కూడా హోస్ట్ గా నాగార్జునే చేస్తున్నారు. మరి హస్‌లోకి ఎవరెవరు వెళ్తున్నారు అనేదానిపై ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంది. చాలా రోజులుగా కొంత మంది పేర్లు అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

బర్రెలక్క, యాదమ్మ రాజు, అమృత ప్రణయ్, యూట్యూబర్ బంచిక్ బబ్లు, కుమారీ ఆంటీ, మై విలేజ్ షో అనిల్, శ్వేతా నాయుడు, సోనియా సింగ్ ఇంకా పలువురు పేర్లు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే మరో కంటెస్టెంట్ పేరు కూడా రివీల్ అయ్యింది. తాజాగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే? ఓ స్టార్ హీరో బిగ్ బాస్ సీజన్ 8లో అడుగు పెట్టబోతున్నాడంట.

ఇంతకీ అతను ఎవరు అనుకుంటున్నారా? ప్రేమ దేశం సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న హీరో అబ్బాస్. ఆయన ఆ రోజుల్లో చాలా ఫేమస్. కానీ ప్రస్తుతం ఆయన చిత్ర పరిశ్రమకు చాలా దూరంగా ఉంటున్నాడు. అవకాశాలు తగ్గడంతో సినిమాలు వదిలేసి, విదేశాలకు వెళ్లి స్థిరపడినట్లు సమాచారం. కాగా, రీసెంట్‌గ బిగ్ బాస్ మేకర్స్ ఆయనను కలిసి, బిగ్ బాస్‌కు ఆహ్వానించినట్లు సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.



Next Story

Most Viewed