రోడ్డుపై చెత్త ఏరుకుంటున్న స్టార్ యాంకర్.. కారణమేంటంటే? (వీడియో)

by Hamsa |   ( Updated:2024-03-06 06:46:20.0  )
రోడ్డుపై చెత్త ఏరుకుంటున్న స్టార్ యాంకర్.. కారణమేంటంటే? (వీడియో)
X

దిశ, సినిమా: ఝాన్సీ పలు షోస్‌లో యాంకర్‌గా వ్యవహరించడంతో పాటు పలు మూవీ ఈవెంట్స్ చేసి అందరినీ మెప్పించింది. అంతేకాకుండా పలు సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా ఆమె వెంకటేష్ తులసి మూవీలో కోకాపేట ఆంటీగా బట్టర్ ఇంగ్లీష్ మాట్లాడి ఒక్కసారిగా ఫుల్ పాపులారిటీ పెంచుకుంది. ఆ తర్వాత వరుస చిత్రాల్లో నటించింది. కానీ గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు ఆసక్తికర వీడియోలను షేర్ చేస్తుంది. తాజాగా, ఝాన్సీ చెత్తను సేకరిస్తున్న వీడియోను షేర్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అందులో ఎండిపోయిన అరటి ఆకులు, ఎండుగడ్డిని సేకరించి స్వయంగా తన కారులో తీసుకెళ్లింది. దాంతో ఎలాంటి ఉపయోగాలున్నాయో వివరించింది. ప్రస్తుతం ఝాన్సీ వీడియో వైరల్ అవుతుండగా అది చూసిన వారంతా ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Read More..

జ్వరం వచ్చినా పొట్టకూటి కోసం ఇలాంటి పనులు తప్పడం లేదు.. విష్ణు ప్రియ ఇంట్రెస్టింగ్ పోస్ట్


Advertisement

Next Story

Most Viewed