'SSMB28' టైటిల్ లాంచ్ అప్పుడేనట..?

by Shiva |   ( Updated:2023-04-19 17:54:13.0  )
SSMB28 టైటిల్ లాంచ్ అప్పుడేనట..?
X

దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందనే విషయం అందరికి తెలిసిందే. ఈ మూవీకి తాత్కలికంగా 'SSMB28' అని టైటిల్ మూవీ మేకర్స్ లాక్ చేశారు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుందని సమాచారం. తాజాగా ఇప్పుడు మే 31న మహేష్ తండ్రి సూపర్‌స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా మూవీ మేకర్స్ ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ టైటిల్‌ను ప్రకటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో మహేష్ సరసన సిజ్లింగ్ బ్యూటీ పూజా హెడ్గే జోడిగా నటిస్తుంది. ఈ మూవీ ఆగస్టు 11, 2023న విడుదల కానుంది. ఈ సినిమాలో జగపతిబాబు, శ్రీలీల కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో రానున్న ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. సినిమాకి మ్యూజిక్ సంచలనం ఎస్.ఎస్.థమన్ బాణీలను అందిస్తున్నారు.

Advertisement

Next Story