మహేశ్ బాబు-త్రివిక్రమ్ సినిమా అప్డేట్‌పై ప్రొడ్యూసర్ క్లారిటీ

by Hamsa |   ( Updated:2023-04-27 15:40:38.0  )
మహేశ్ బాబు-త్రివిక్రమ్ సినిమా అప్డేట్‌పై ప్రొడ్యూసర్ క్లారిటీ
X

దిశ, వెబ్ డెస్క్: స్టార్ హీరో మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ‘SSMB28’ అనే వర్కింగ్ టైటిల్‌తో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. అయితే ఈ సినిమా అప్డేట్ వస్తుందని కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అది చూసిన నిర్మాత నాగవంశీ పుకార్లకు చెక్ పెడుతూ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. ‘‘ ఈ గాసిప్ రాయుళ్లు పాదయాత్ర చేస్తే లేదా సినిమాలపై పుకార్లు పుట్టిస్తే ఇండస్ట్రీకి ఏం లాభం చేకూరుతుందని అనుకుంటున్నారేమో. #SSMB28 ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్‌గా ఉండాలని మేము కోరుకుంటున్నాము. మీరు మా మాటను గుర్తుపెట్టుకోండి. ఈ సినిమా మీద ఎటువంటి రూమర్లు స్ప్రెడ్ చేయకుండా వదిలేస్తే షూటింగ్ సజావుగా చేసుకుంటాము. ఇది జనవరి 2024 న విడుదలవుతుంది. అభిమానులారా, మీరు ఫిలిమ్‌ని ఇష్టపడ్డతారు. మే 31న వేచి ఉండండి. మంటల్లో మేము ఏమి చేస్తున్నామో అర్థం చేసుకోండి. ఈ ప్రకటనలో కవిత్వం లేదు’’ అంటూ రాసుకొచ్చాడు. అయితే ఈ సినిమా అప్డేట్ మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.

Advertisement

Next Story