SSMB 28 : టైటిల్ ఇదేనా..?

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-28 13:12:42.0  )
SSMB 28 : టైటిల్ ఇదేనా..?
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుందంటే ఫ్యాన్స్‌కి పండగే. అయితే ఆయన హీరోగా తాజాగా ‘SSMB 28’ తెరకెక్కుతోంది. ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకుడిగా వ్యహరిస్తున్నారు. తొలుత సినిమాకి ‘అమరావతికి అటూ ఇటూ’ అనే టైటిల్ అనుకున్నారట. అయితే తాజాగా క్లాస్‌తో పాటు మాస్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా మరో టైటిల్ పెట్టారట. ఫ్యాన్స్ హై ఎక్స్ పెక్టేషన్స్ రీచ్ అయ్యేలా ‘గుంటూరు కారం’ అనే సినిమా టైటిల్ పెట్టినట్లు టాక్ నడుస్తోంది. ఇదే టైటిల్‌ను దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ నెల 31న ఈ చిత్రం టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నారు. సూపర్ స్టార్ జయంతి సందర్భంగా మోసగాళ్లకు మోసగాడు సినిమాను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. సినిమా ప్రదర్శించే అన్ని థియేటర్లలో ‘SSMB 28’ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నారు.

Read More... ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరు రివీల్ చేసిన అల్లు అర్జున్ (వీడియో)

Advertisement

Next Story