- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆయన మాటతో నా గుండె పగిలింది.. SS రాజమౌళి గురించి మమతా మోహన్ దాస్ కామెంట్
దిశ, సినిమా: నటి మమతా మోహన్ దాస్ గురించి పరిచయం అక్కర్లేదు.. మంచి మూవీస్‌లో నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, ప్రజెంట్ హెల్త్ ప్రాబ్లమ్స్‌తో సఫర్ అవుతోంది. రెండు సార్లు క్యాన్సర్‌ను జయించిన ఆమె ప్రస్తుతం చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మమత, దర్శకుడు రాజమౌళి గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.
ఆమె మాట్లాడుతూ ‘‘ కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అరుంధతి’ సినిమా గొప్ప విజయాన్ని అందుకుంది. ఈ మూవీతో హీరోయిన్ అనుష్క కెరియర్ ఒక్కసారిగా మారిపోయింది. కానీ ఈ అరుంధతి ఆఫర్ ముందుగా నాకే వచ్చింది. నిర్మాత శ్యాం ప్రసాద్‌రెడ్డి నన్ను సంప్రదించగా సంతకం కూడా చేశాను. కానీ అంత పెద్ద సినిమా తీసే సత్తా ఆ డైరెక్టర్‌కు లేదని కొందరు నాతో చెప్పారు. అప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా ఆ మూవీ నుంచి తప్పుకున్నా.
కానీ తర్వాత ‘యమదొంగ’ సినిమాలో నటిస్తున్న టైంలో రాజమౌళి సార్‌తో ఈ విషయాన్ని చెప్పాను. దానికాయన ఇచ్చిన సమాధానం నేనిప్పటికీ మర్చిపోలేను. ‘‘నువ్వు ఆ సినిమా చేయాల్సింది.. నో చెప్పి చాలా పెద్ద తప్పు చేశావు. ఎందుకంటే ఆ మూవీలో నటించిన అనుష్క జీవితం ఒక్కసారిగా మారిపోయింది’’ అని రాజమౌళి నాతో అన్నమాటతో నా గుండె పగిలినట్టయింది’’ అని చెప్పుకొచ్చింది మమతా మోహన్ దాస్.