దేవుడిని కలిసాను.. ఎస్ఎస్ రాజమౌళి ఎమోషనల్

by GSrikanth |   ( Updated:2023-01-21 14:12:42.0  )
దేవుడిని కలిసాను.. ఎస్ఎస్ రాజమౌళి ఎమోషనల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సినీ దిగ్గజం, ప్రఖ్యాత హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ స్టీవెన్ స్పీల్ బర్గ్‌ను డైరెక్టర్ రాజమౌళి కలిశారు. అంతర్జాతీయ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమంలో భాగంగా రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రాం చరణ్, కీరవాణి తదితరులు కుటుంబ సమేతంగా అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా యూనివర్సల్ పార్టీలో రాజమౌళి, కీరవాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులను కలిశారు. ఇందులో భాగంగా మొదటిసారి స్పీల్ బర్గ్‌ను కలిసి కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను రాజమౌళి ట్విట్టర్‌లో షేర్ చేశారు. 'ఇప్పుడే దేవుడిని కలిశాను' అని ట్వీట్ చేశారు. 'నాటునాటు ఎంతో నచ్చిందని ఆమన చెప్పిన మాటల్ని నేనింకా నమ్మలేకపసోతున్నాని' కీరవాణి ట్వీట్ చేశారు. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, ప్రపంచవ్యాప్తంగా రికార్డు సృష్టించిన జురాసిక్ పార్క్ మూవీ డైరెక్టరే స్టీవెన్ స్పీల్‌బర్గ్.

Also Read: మరో వివాదంలో ప్రభాస్ 'ఆదిపురుష్'

Advertisement

Next Story