Srinu Vaitla: 'ఆగడు' ప్లాప్ కు కారణం నేను కాదంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీనువైట్ల

by Prasanna |
Srinu Vaitla: ఆగడు ప్లాప్ కు కారణం నేను కాదంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీనువైట్ల
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ శ్రీనువైట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెంకీ, దుబాయ్ శీను, ఢీ, కింగ్, రెడీ, దూకుడు, బాద్ షా లాంటి సినిమాలతో మంచి డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ, గత కొన్నేళ్లుగా సినిమాలు చేయడం లేదు. ఆ మధ్య అమర్ అక్బర్ ఆంటోని అనే మూవీ చేసాడు. కానీ, ఇది అట్టర్ ప్లాప్ అయింది.

ఇప్పుడు,యాక్షన్ హీరో గోపీచంద్ తో 'విశ్వం' అనే కొత్త సినిమాని చేస్తున్నాడు. ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని సినిమా కోసం చాలా కష్ట పడ్డాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ మూవీ దసరా కానుకగా రానుంది.

అయితే, ఇక మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో శ్రీను వైట్ల.. 'ఆగడు' మూవీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. "ఆగడు కథకు నిర్మాతల నుంచి అనుకున్నంత బడ్జెట్ సెట్ అవ్వకపోవడంతో .. స్టోరీని మార్చాల్సి వచ్చింది. అయిన సినిమా కోసం కష్టపడినా ఫలితం రాలేదు. 'ఆగడు' ప్లాప్ కు కారణం నేను కాదు.. ఇది నాకు నేనుగా తీసుకున్న గొయ్యి.." అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు శ్రీను వైట్ల చేసిన కామెంట్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.

Advertisement

Next Story