లవ్ అంటూ బోలెడు మంది నన్ను మోసం చేశారు.. గతాన్ని బయటపెట్టిన శ్రీముఖి

by sudharani |   ( Updated:2023-11-29 09:31:58.0  )
లవ్ అంటూ బోలెడు మంది నన్ను మోసం చేశారు.. గతాన్ని బయటపెట్టిన శ్రీముఖి
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర స్టార్ యాంకర్లలో శ్రీముఖి ఒకరు. తన అందంతో, చలాకీ మాటలతో ఎంతో మంది అభిమానులను దక్కించుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం సినిమా ఫంక్షన్లు, ఆడియో రిలీజ్, ప్రీ రిలీజ్ ఈవెంట్లతో బిజీ లైఫ్ లీడ్ చేస్తుంది. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ అమ్మడు.. రీసెంట్‌గా చిట్ చాట్ నిర్వహించి తన కెరీర్, పర్శనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

ఇన్‌స్టాగ్రామ్ బ్రాడ్ కాస్ట్ చానల్ ద్వారా తన అభిమాలనులతో చిట్ చాట్ నిర్వహించగా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలోనే ‘మీరు లవ్‌లో ఎప్పుడైనా ఫెయిల్ అయ్యారా..? అని ఓ అభిమాని ప్రశ్నించగా.. ‘బొచ్చెడు సార్లు’ అంటూ తనదైన స్టైల్‌లో రిప్లై ఇచ్చింది శ్రీముఖి. ‘పెళ్లి అయితే యాంకరింగ్ మానేస్తారా’ అనే ప్రశ్న ఎదురవ్వుగా.. పెళ్లైనా యాంకరింగ్ మానేది లేదంటూ క్లారిటీ ఇచ్చింది. ఇక తను పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అనే ప్రశ్నపై స్పందించిన శ్రీముఖి.. ‘త్వరలోనే తప్పకుండా పెళ్లి చేసుకుంటా’ అని చెప్పింది. కానీ ఎవరిని, ఎప్పుడు అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే.. ఎవరైనా బాధలో ఉన్న, నేను ఉన్న కొంచెం సేపు వాళ్లతో మాట్లాడి.. కాసేపు వాళ్లను డైవ‌ర్ట్ చేసి నేను కూడా డైవ‌ర్ట్ అవుదామ‌న్నదే బ్రాడ్‌కాస్ట్ చానల్ పెట్టడానికి కార‌ణ‌మ‌ని తెలిపింది. కాగా.. గతంలో శ్రీముఖి త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలసిందే.

Advertisement

Next Story