ఫోటో షూట్ ఒకే కానీ పెళ్లికి నో అంటున్న శ్రీముఖి.. అందంతో మతిపోగొడుతుంది కదా!

by Jakkula Samataha |
ఫోటో షూట్ ఒకే కానీ పెళ్లికి నో అంటున్న శ్రీముఖి.. అందంతో మతిపోగొడుతుంది కదా!
X

దిశ, సినిమా : అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె అందానికి పెట్టింది పేరు. యాంకర్‌గా తన కెరీర్ మొదలు పెట్టిన ఈ బ్యూటీ తన మాటల గారడీతో అందరినీ ఆకట్టుకుంది. అంతే కాకుండా పలు సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసింది. అలాగే మూవీ ఈవెంట్స్, షోలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇక శ్రీముఖి బిగ్ బాస్‌కు వెళ్లిన తర్వాత మరింత ఫేమ్ సంపాదించుకుంది. అయితే ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన పెళ్లి ముచ్చట ఎప్పుడూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా త్వరలో శ్రీముఖి పెళ్లి, వరుడు ఇతడే అంటూ అనేక వార్తలు పుట్టుకొస్తున్నాయి. కానీ అవన్నీ రూమర్స్‌గానే మిగిలిపోతున్నాయి.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడు వరసగా ఫోటో షూట్ చేస్తూ కుర్రకారు మది మాయచేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఫోటో షూట్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. రోజు రోజుకు సరికొత్తగా కనిపిస్తూ రచ్చచేస్తోంది. బ్లాక్ కలర్ స్కట్ ధరించి ట్రెడిషన్ లుక్‌లో దర్శనం ఇచ్చింది. ఇక ఇది చూసిన వారు రాములమ్మ లుక్ అదిరింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు మాత్రం పెళ్లి అంటే నో అంటావు, ఫోటో షూట్ మాత్రం ఒకేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక శ్రీముఖి చివరగా చిరంజీవి భోళా శంకర్ సినిమాలో కనిపించి సందడి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుం ఈమె రూ.2లక్షలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈవెంట్స్ చేస్తూ కూడా బాగానే సంపాదిస్తుందంట.

Advertisement

Next Story

Most Viewed