ఛీ..ఛీ ఆఫర్లు లేకపోవడంతో తండ్రి వయసున్న హీరోతో శ్రీలీల రొమాన్స్‌.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!

by Kavitha |   ( Updated:2024-04-23 06:09:41.0  )
ఛీ..ఛీ ఆఫర్లు లేకపోవడంతో తండ్రి వయసున్న హీరోతో శ్రీలీల రొమాన్స్‌.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!
X

దిశ,సినిమా:ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే మంచి స్టార్ డమ్‌ను సొంతం చేసుకుంది ఈ యంగ్ బ్యూటీ. ‘పెళ్లి సందడి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. మహేష్ బాబు, రవితేజ, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సరసన నటించి అందరినీ మెప్పించింది. ఇక శ్రీలీల తన అందం, యాక్టింగ్, డాన్స్‌తో అందరిని ఆకట్టుకుంది. గత ఏడాది కళ్లు మూసుకొని సినిమాలకు సంతకాలు చేసినట్టుంది ఈ భామ. దాదాపు నెలకొక సినిమా విడుదలైంది. అయితే, వాటిలో భగవంత్‌కేసరి, గుంటూరుకారం తప్పా ఏ సినిమా కూడా ఈ ముద్దుగుమ్మకు కలిసిరాలేదనే చెప్పాలి. దీంతో ఆమె తన చదువు పై ఫోకస్ పెట్టి త్వరలోనే MBBS పూర్తి చేసే పనిలో ఉంది శ్రీ లీల.

ఇదిలా ఉండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ భామకు అదృష్టదేవత తమిళ్‌లో తలుపుతట్టిందని తెలుస్తున్నది. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్న , అజిత్‌ హీరోగా మైత్రీ మూవీమేకర్స్‌వారు తమిళంలో నిర్మిస్తున్న చిత్రం 'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ'. ఈ చిత్రంలో కథానాయికగా శ్రీ లీలను ఎంపిక చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు చిత్ర బృందం ఇప్పటికే ఆమెను సంప్రదించగా కథ నచ్చడంతో ఆమె ఓకె చెప్పిందంటూ తమిళనాట కథనాలు చక్కర్లు కొడుతున్నాయి.ఇదే కనుక నిజమైతే శ్రీ లీల పంట పండినట్టే. తమిళంలో తొలి అవకాశమే అజిత్‌ లాంటి సూపర్‌స్టార్‌తో రావడం అంటే చిన్న విషయం కాదు కదా. ఇక ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

Advertisement

Next Story