‘టిల్లు స్క్వేర్’లో లిల్లీ పాత్ర వదులుకున్న యంగ్ బ్యూటీ ఎవరో తెలుసా..?

by sudharani |   ( Updated:2024-04-03 06:34:19.0  )
‘టిల్లు స్క్వేర్’లో లిల్లీ పాత్ర వదులుకున్న యంగ్ బ్యూటీ ఎవరో తెలుసా..?
X

దిశ, సినిమా: యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ, డైరెక్టర్ మల్లిక్ రామ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘టిల్లు స్క్వేర్’. బ్యూటీఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఫస్ట్ షోతోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతూ రచ్చరచ్చ చేస్తుంది. ఎక్కడ విన్నా.. చూసిన టిల్లు గాడి ముచ్చట్లే. కేవలం నాలుగు రోజుల్లో రూ.78 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. ప్రస్తుతం రూ.100 కోట్ల చేరువలో ఉన్నట్లు సమాచారం. అంతే కాకుండా ఇప్పటికే రూ.15 కోట్లకు పైగా లాభాలు వచ్చినట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

‘టిల్లు స్వ్కేర్’ ఇంత సక్సెస్ అవ్వడానికి సిద్ధూ కామెడీ టైమింగ్ ఒక రీజన్ అయితే.. గ్లామరప్ పాత్రలో నటించి కుర్రాళ్లను కట్టిపడేసిన అనుపమ మరో కారణంగా చెప్పుకోవచ్చు. ఈ చిత్రం రిలీజ్‌కు ముందు అనుపమపై చాలా ట్రోలింగ్స్ వచ్చాయి. ఇంత బోల్డ్‌గా, రొమాంటిక్‌గా నటిస్తుంది ఏంటని. కానీ రిలీజైన తర్వాత అనుపమ యాక్టింగ్‌కు, గ్లామర్ షోకు విమర్శకుల ప్రశంసలు అందుతున్నాయి. అయితే.. ఈ మూవీకి హీరోయిన్‌గా మొదట అనుపమని అనుకోలేదట. వేరే హీరోయిన్‌ను సంప్రదించారట మూవీ టీం. ఆ విషయాల్లోకి వెళితే..

ఈ చిత్రంలో లిల్లీ రోల్ కోసం మొదట యంగ్ బ్యూటీ శ్రీలీలను అనుకున్నారట. ఆమె కూడా కథకు ఓకే చెప్పి షూట్‌కు వెళ్లిందట. కానీ కొన్ని సీన్స్ మరి బోల్డ్‌గా, రొమాంటిక్‌గా ఉండటంతో శ్రీలీల తప్పుకుందట. దీంతో అనుపమ ఆ ప్లేస్‌లోకి వచ్చింది. అయితే.. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ కావడంతో ‘శ్రీలీల ఈ పాత్ర చెయ్యకపోవడమే మంచిది అయింది.. ఒకవేళ చేసిన అనుపమకు వచ్చినంత క్రేజ్ రాకపోదును.. లిల్లీ పాత్ర శ్రీలీలకు సెట్ అవ్వదు’ అంటూ రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు.

Advertisement

Next Story