వాళ్ల ముఖాలు చూసే ఫ్యాన్స్ టికెట్స్ కొంటున్నారు.. శ్రీలీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by samatah |   ( Updated:2023-05-24 13:29:16.0  )
వాళ్ల ముఖాలు చూసే ఫ్యాన్స్ టికెట్స్ కొంటున్నారు.. శ్రీలీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: హీరోల ముఖాలు చూసే ప్రేక్షకులు టికెట్స్ కొంటున్నారంటోంది శ్రీలీల. (Sreeleela) తాజాగా ఓ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడిన యంగ్ బ్యూటీ ఫిల్మ్ ఇండస్ట్రీ కల్చర్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. నిజం చెప్పాలంటే ఫ్యాన్స్ సినిమా విడుదలయ్యాక మొదటిరోజు టికెట్స్ కేవలం తమ అభిమాన హీరోలకోసమే కొంటున్నారని చెప్పింది. అలాగే తనకు అందరికంటే ఎక్కవ గుర్తింపు రావాలనే ఆవ లేదన్న నటి.. మంచి పాత్రలు దొరికితే చాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ‘నా పాత్రలు ఎప్పటికీ గుర్తిండిపోవాలి. అందుకోసం ప్రతి సినిమాలో భిన్నంగా కనిపించడానికి ఇష్టపడతా. ప్రస్తుతం చేతినిండా పనుంది. ఒక్క రోజు కూడా ఖాళీగా ఉండలేకపోతున్నా. సెట్స్‌లో పనిని ఎంజాయ్ చేస్తున్నా. కెమెరా ముందు ఉండటం నాకు వ్యసనంగా మారిపోయింది. ఇక ఇటీవలే ఎంబీబీఎస్‌లోనూ జాయిన్ అయ్యాను. అమ్మ డాక్టర్ కాబట్టి నేనూ అదే కోవలో వైద్య విద్య చదువుతున్నా. చదువు, కెరీర్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళతా’ అని పలు విషయాలపై మాట్లాడింది.

Also Read..

ఆ నాలుగేళ్లు నరకం అనుభవించాను.. నాకు ఎవరి సపోర్ట్ లేదు

Advertisement

Next Story