అవకాశాలు లేక అలాంటి రోల్‌కి ఓకే చెప్పిన శ్రీలీల..! ఇదేందయ్య ఇది అంటూ తలలు పట్టకుంటున్న ఫ్యాన్స్

by Disha Web Desk 7 |
అవకాశాలు లేక అలాంటి రోల్‌కి ఓకే చెప్పిన శ్రీలీల..! ఇదేందయ్య ఇది అంటూ తలలు పట్టకుంటున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ శ్రీలీల అనతి కాలంలోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుని.. మొన్నటి వరకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా దూసుకుపోయింది. పెద్దా, చిన్నా అనే తేడా లేకుండా.. స్టార్స్ హీరోలతో కూడా నటించి దుమ్మరేపింది. కానీ, ఇటీవల ఈ అమ్మడు నటించిన సినిమాలు వరుసగా డిజాస్టర్‌గా నిలిచాయి. దీంతో శ్రీలీల గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయినట్లు అయింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రంమలోనే శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

అందులో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినిమా ఒకటి. అజిత్ ప్రస్తుతం ‘విదా ముయర్చి’ అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ అనే సినిమా చెయ్యనున్నట్లు తెలిపారు. అధిక్ రవి చంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈమూవీలో హీరోయిన్‌గా మొదట జాన్వీ కపూర్‌ పేరు తెరపైకి వచ్చింది. ఇప్పుడు శ్రీలీల పేరు కూడా వినిపిస్తుంది. అయితే.. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గాన లేక కీలక పాత్రన అనేది తెలియలేదు.

ఇక దీంతో పాటు.. శ్రీలీల ఓ ఐటెమ్ సాంగ్‌కు సైతం ఓకే చెప్పినట్లు నెట్టింట ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. దళపతి విజయ్‌ ప్రస్తుతం ‘గోట్‌(గ్రేటెస్ట్ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌)’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా కాగా.. ఇందులో ఓ ఐటెమ్‌ సాంగ్‌ కోసం శ్రీలీలని సంప్రదించారట మేరక్స్. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ.. ఆఫర్లు లేనంత మాత్రన ఐటెమ్ సాంగ్ ఎలా ఒప్పుకుంటుంది అంటూ నెట్టింట కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

Read More...

వారికి నా ప్రైవేట్ పార్ట్స్ మీదే కన్ను.. జూమ్ చేస్తారంటూ బోల్డ్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్



Next Story

Most Viewed