Sri Reddy: జగన్ జ్ఙాపకాలను బెడ్ కింద దాచుకున్న శ్రీరెడ్డి.. ఎమోషనల్ వీడియో వైరల్

by Anjali |   ( Updated:2024-07-31 03:07:59.0  )
Sri Reddy: జగన్ జ్ఙాపకాలను బెడ్ కింద దాచుకున్న శ్రీరెడ్డి.. ఎమోషనల్ వీడియో వైరల్
X

దిశ, సినిమా: నిత్యం సోషల్ మీడియాలో ప్రముఖ సెలబ్రిటీలపై, రాజకీయ నాయకులపై కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో హైలెట్‌గా నిలుస్తుంటుంది హాట్ బ్యూటీ శ్రీరెడ్డి. ఈమె మొదట్లో పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ పాత్రల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. తర్వాత అవకాశాలు రాకపోవడంతో దర్శక, నిర్మాతలపైనే విమర్శలు గుప్పించింది. ఈ భామ సోషల్ మీడియా సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు. సంబంధం లేని విషయాల్లో కూడా తలదూర్చి తరచూ నెట్టింట వైరల్ అవుతూ ఉంటుంది. గతంలో మానసికంగా, శారీరకంగా ఎంతో మంది తనను వేధిస్తున్నారని, కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అన్నింటికి మించి హైదరాబాదులో జూబ్లీహిల్స్‌లోని ఫిలీం ఛాంబర్ కార్యాలయం వద్ద శ్రీరెడ్డి బట్టలు విప్పి నిరసన చేసి మరింత రచ్చ చేసింది.

రీసెంట్‌గా ఏపీ సీఎం చంద్రబాబు పై, మంత్రి నారా లోకేష్ పై, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే శ్రీరెడ్డి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రికి మద్ధతుగా మాట్లాడుతుంది. తాజాగా శ్రీరెడ్డి బెడ్‌పై జగన్ ప్రజలకు అందించిన పథకాల పాంప్లెట్స్ బెడ్ కింద దాచిపెట్టిన ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ‘ఇన్ని కోట్ల మందికి మంచి జరిగాక ఆ అభిమానం ఏమైందో, ఆ అప్యాయత ఏమైందో’ అంటూ వాయిస్ యాడ్ చేసింది. ఈ వీడియో నెట్టింట వైరలవ్వడంతో జగన్ జ్ఞాపకాలను నీ బెడ్ కింద దాచుకుని బాధపడుతున్నావా శ్రీరెడ్డి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story
null