మెగాస్టార్ చిరంజీవికి శ్రీరెడ్డి బర్త్ డే విషెస్

by Anjali |   ( Updated:2023-08-22 07:05:00.0  )
మెగాస్టార్ చిరంజీవికి శ్రీరెడ్డి బర్త్ డే విషెస్
X

దిశ, సినిమా: శ్రీ రెడ్డి అనే పేరు సోషల్ మీడియా యూజర్లకు పరిచయం అక్కర్లేదు. కాంట్రవర్సీ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఈ హాట్ బ్యూటీ ఎప్పుడు వివాదాల్లో తలదూరుస్తూ పలు రకాల కామెంట్లు చేస్తూ బాగా వైరల్ అవుతూ ఉంటుంది. ఇక నటిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ అవకాశాలు లేక పాపులారిటీ కోసం టాలీవుడ్ హీరోలు, డైరెక్టర్‌, నిర్మాతలను ఇష్టం వచ్చినట్టు తిడుతూ రచ్చ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా శ్రీరెడ్డి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. అందులోను జనసేన పార్టీ అధినేత పవన్‌పై ఎప్పుడు ఘాటుగా విమర్శలు చేస్తూ అసభ్యకరంగా కామెంట్‌లు చేస్తుంది. అయితే తాజాగా నటి శ్రీరెడ్డి ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ‘పుట్టినరోజు శుభాకాంక్షలు మెగాస్టార్ చిరంజీవి గారు’ అంటూ ట్వీట్ చేసింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఎప్పుడు చిరు ఫ్యామిలీని విమర్శిస్తూ ఉండే శ్రీరెడ్డి ‘చిరంజీవి గారు’ అంటూ మెగాస్టార్ కి విష్ చెయ్యడంతో అందరు షాక్ అవుతున్నారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు ‘నువ్వు పాజిటివ్‌గానే విష్ చేస్తున్నావా’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story